యోగా గురువు రాం దేవ్ బాబా పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ కి కేంద్ర ప్రభుత్వం డబ్భై ఐదు శాతం రాయితీ భూములు ఇవ్వడం అనే సమాచారాన్ని కొందరు అధికారులు బహిర్గతం చేసారు.

మొత్తం పది వేల కోట్లకి పైగా టర్నోవర్ కలిగిన ఎ సంస్థ యొక్క గుట్టు రట్టు చేసారు అధికారులు. ఈ సంస్థ కి అనేక చోట్ల బ్రాంచీ లు ఉన్నాయి. అతి పెద్ద నగరాలు అయిన నాగ్ పూర్, నోయిడా, ఇండోర్, విజయవాడల్లో కొత్తగా మెగా యూనిట్ లు పెట్టాలి అని ఫిక్స్ అయిన పతంజలి అర్జీ పెట్టుకోగా , డబ్భై ఐదు శాతం రాయతీ ఇస్త్తూ భూ కేటాయింపులు చేసింది ప్రభుత్వం.

సమాచార హక్కు చట్టం ప్రకారం కొందరు దీనికి సంబంధించి వివరాలు కోరగా అప్పగించారు అధికారులు. దీంతో అప్పనంగా ప్రభుత్వ భూములను ధారాదత్తం చేస్తున్నారని ఆరోపణలు వెలువడ్డాయి.

దీంతో దీనికి కారణమైన సమాచారచట్టం అధికారులపై సర్కారు బదిలీ వేటు వేసింది. మహారాష్ట్ర ఎయిర్ పోర్టు డెవలప్ మెంట్ కంపెనీ మార్కెటింగ్ మేనేజరు అతుల్ ఠాక్రేను ముంబై నుంచి నాగ్‌ పూర్‌ కు, మరో మార్కెటింగ్ మేనేజరు సమీర్ గోఖలేను ముంబయి నుంచి నాగ్ పూర్ కు బదిలీ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: