మనిషి తాను పుట్టేటప్పుడు తాను ఏ కులంలోనో? ఏ మతం లోనో పుట్టాలని నిర్ణయించుకొని పుట్టడు. పుట్టిన తరవాతే తల్లిదండ్రుల కారణంగా మనం ఏ కులానికి చెందుతామో తెలుస్తుంది అదీ, పెద్దవారైన తరవాత. ఈ మాత్రానికి సినిమా, రాజకీయ రంగాల్లో ఈ కులపిచ్చి ఎందుకు? అందరు మన సినిమాలు చూస్తేనే వసూళ్ళ వర్షం కురుస్తుంది. అందరు మనకు తలచుకొని ఓటేస్తే ఎన్నికల్లో గెలుస్తారు. ఈ మాత్రానికి కుల మత దురద ఎందుకనేది విఙ్జుల ప్రశ్న.

Image result for jagapathi babu about casteism


కొంతమంది తెలుగు స్టార్ హీరో లను గమనించండి. వారి వెంట ఆయన కులానికి చెందిన కొందరు "కిచెన్ కాబినెట్" లా తిరుగుతుంటారు. "మనోడు మనోడు" అంటూ ముచ్చట పడుతూ ఆయనకు తముకేస్తూ కులం గురించి తమ ఛాతిని విశాలం చేస్తూ తెగ ఊదర కొడుతుంటారు. అవన్నీ వినేవాళ్ళు మన హీరో కూడా కుల పిచ్చి గాడేమో అనుకునే ప్రమాదముంది. 

అయితే, తనదైన శైలిలో సినీ రంగాన్ని ఏలేస్తున్న విలక్షణ నటుడుగా దూసుకుపోతున్న ప్రతినాయక పాత్రధారి, నటుడు జగపతి బాబు, ఇలాంటి కులపిచ్చ గాళ్ళకు ఒక టెలివిజన్ కార్యక్రమంలో అందరికీ అర్ధమయ్యేలా చెప్పాడు. 

Image result for jagapathi babu about casteism


"అవసరమైనప్పుడు మన పని కోసం ఒక మంత్రిగారి దగ్గరకు వెళతాం. అతనిది ఏ కులమైనా ఏ మతమైనా కూడా అవసరం కోసం మర్యాద పూర్వకంగా అతని కాళ్ల మీద పడతాం. అలాగే చాలా మంది కార్పొరేట్ పవర్ బ్రోకర్లు ఉంటారు, వారి కులం, మతం ఏంటో చూడకుండానే వారిని సాయం అడుగుతాం. ఇంట్లో కార్ డ్రైవర్, పనిమనిషిని,  పనికోసం పెట్టుకునేటప్పుడు కులం గురించి మాట్లాడం. అసలు మనం కులం వాడెవడన్నా ఎదిగితే కూడా.. 'వాడా?... మనోడేలే! ఎలాగో లాగా సంపాదించాడులే' అంటూ నర్మగర్భంగా మనం చేయలేక పోయినా మన "ఆహం" ప్రదర్శిస్తాం. ఆస్థి కోసం తమ సొంత వాళ్ళను చంపినోళ్లు ఉన్నారు.. అప్పుడు కులం గుర్తుకు రాలేదు  పైగా, కులం అనే ఫీలింగ్ చాలామందికి లేకపోయినా కూడా పక్కనోళ్లు మత్తులా ఎక్కిస్తుంటారు. అసలు ఈ కులం అన్న పదానికి అర్ధమేలేదు. ప్రేమ అనేది ముఖ్యం"  అంటూ ఒక ఇంటర్యూ లో కులం పిచ్చి మత్తుపై కుండబద్దలు కొట్టారు. 


Image result for hero jagapati babu about castism in telugu industry


నిజమే కదా! ఈ కుల మత్తును సినిమారంగంలో వివిధరంగాల్లో పనిచేసేవారు ఎక్కించుకుంటే ఎలా? మన లీడింగ్ హీరోల కులాలకు చెందివారెవరూ ముఖ్యంగా ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లు, విజువల్ ఎఫెక్ట్స్ నిపుణులు, సాంకేతిక నిపుణులు, ఎడిటర్లు, రచయితలు, సంభాషణలు రాసేవారు, మేకప్ ఆర్టిస్టులు, లైట్లు మోసే లైట్ మ్యాన్స్, కెమెరామ్యాన్లు అందరూ వేరే కులాలవారే. అలాంటప్పుడు అంతమంది కలసి తీసిన సినిమాకు, మా హీరోది ఆ కులం కాబట్టి మా సినిమాలను మా కులం ఫ్యాన్స్ బాగా చూస్తారు అన్నట్లు మౌత్ పబ్లిసిటీ చేయడం దారుణం. ఏ సినిమా అయినా కూడా అన్ని కులాల వారు చూస్తేనే ఆడుతుంది. మరి హీరోల పక్క నుండే కొన్ని నక్కలకు ఇవన్నీ అర్ధమవ్వాలి. 


Image result for hero jagapati babu about castism in telugu industry


అసలు సాంకేతికతకు, కళకు కులం లేదు.... అవి కలసి అందించే వినోదానికి కులం లేనప్పుడు - కొందరు కథానాయకుల కులాలను ఆ కథానాయకుల కుల ఆరాధకులు దురభిమానులుగా మారి కులజాఢ్యం వ్యాపింపచేయటం ఏమి న్యాయం? ఒక కులానికి చెందిన ఒక కులానికి చెందిన కథానాయకుడు నటిస్తే ఆ సినిమాలో సరుకు లేకపోతే ఆ హీరో కులపోళ్ళు సినిమాని విజయవంతం చేయగారా? అదే లేనప్పుడు కులమెందుకు? ఒక సారి ఆలోచించండి.


ఒక సారి పరిశీలిస్తే దంగల్, బాహుబలి సినిమాల్లో నటించిన నటులది ఏకులం, నేపధ్యంలో పని చేసిన సాంకేతిక నిపుణులది ఏ కులం, ఏ ప్రాంతం, ఇవేవి పనిచేయవు. విశ్వవ్యాప్తంగా అన్నీ ప్రాంతాల, దేశాల, ఖండాంతరాల ప్రజలు చూడబట్టే ఆ సినిమాలు అంత వసూళ్ళు సాధించాయి. జగపతి బాబు చెప్పింది అక్షరాలా నిజం. సో మనం కులం మతం మరచి పోదామా? హాట్స్ ఆఫ్ టు జగపతి బాబు! ఇదంతా జగపతి బాబు క్షుణ్ణం గా చెప్పారు. దాన్ని వారంతా అర్దం చేసుకోవాలి. రానున్న 2019 ఎన్నికల్లో కుల మత విభజనను పక్కనబెట్టి ఓట్లేసినప్పుడే తెలుగుజాతి పరువు నిలబడుతుంది.  


Related image

మరింత సమాచారం తెలుసుకోండి: