ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఏపీ రాజధాని అయిన అమరావతి నిర్మాణం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.  ఇప్పుడు విజయవాడ రూపు రేఖలు మార్చే యోచనలో ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.  మెట్రోరైలుపై వెనక్కు తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం లైట్ మెట్రోకు జెండా ఊపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ ఆరునెలల్లో రాబోతోంది. 
Related image
జర్మనీకి చెందిన ఓ సంస్థ ఈ నివేదికను ఉచితంగానే అందచేయనుంది. ఈ నివేదిక తయారీకే కనీసం ఆరుకోట్లు  ఖర్చవుతుందని అంచనా. డీపీఆర్ సిద్ధం కాగానే కేంద్రం నుంచి అనుమతి తీసుకుని టెండర్లను పిలుస్తారు. మెట్రోను రెండు కారిడార్లలో 26కిలోమీటర్లు నిర్మించాలన్నది ముందు ప్రభుత్వ ఆలోచన. ఇందుకు సుమారుగా 6,800 కోట్ల వ్యయం  అవుతుందని అంచనా వేసారు. అయితే ఇప్పుడు లైట్ మెట్రోలో అదే ఖర్చుతో 42 కిలోమీటర్ల మేర లైట్ మెట్రో నిర్మిస్తారు. అంటే మొత్తమ్మీద లైట్ మెట్రోతో ప్రాజెక్ట్ స్వరూపం పూర్తిగా మారిపోతుంది. 
Related image
అంత నష్టాన్ని భరించే స్థితిలో ప్రభుత్వం లేదు. దీంతో లైట్ మెట్రోవైపు మొగ్గుచూపింది. అంతే కాదు గన్నవరం వరకూ ఇటు తాడేపల్లి సమీపంలోని కృష్ణాజంక్షన్ వరకూ నిర్మాణం జరుగుతుంది. సాధ్యమైనంత త్వరగా లైట్ మెట్రోను పట్టాలెక్కించాలన్నది చంద్రబాబు ఆలోచన. లైట్ మెట్రోతోనూ నష్టాలు తప్పవని నివేదికలు తేలుస్తున్నాయి.
Image result for vijayawada
అయితే తక్కువ దూరానికి అంత నష్టం భరించడం  కన్నా కాస్త ఎక్కువ దూరంతో అదే నష్టాన్ని భరించడం మేలు కదా అన్నది చంద్రబాబు ఆలోచన. పైగా బెజవాడ ట్రాఫిక్ రోజురోజుకూ పెరిగిపోతోంది. మరోవైపు దుర్గమ్మ ఫ్లైఓవర్ నత్తనడకన సాగుతున్నా ఇప్పుడిప్పుడే పనులు ఊపందుకుంటున్నాయి. ఇటు బెంజ్ సర్కిల్ దగ్గర కూడా పనులు మొదలయ్యాయి.
Image result for vijayawada
మరోవైపు కృష్ణలంకలో రాఘవయ్య పార్క్ దగ్గర రోడ్డు విస్తరణ పనులు పూర్తికావొచ్చాయి. ఇవన్నీ పూర్తైతే బెజవాడ మరింత అందంగా తయారవుతుంది. ట్రాఫిక్ జంజాటమూ తగ్గుతుంది. వచ్చే ఎన్నికల నాటికి ఇవన్నీ పూర్తిచేస్తే బెజవాడ ప్రజలు ఖచ్చితంగా  తమకే ఓటేస్తారన్నది ప్రభుత్వ ఆలోచన. ఈలోపే రాజధాని శాశ్వత కట్టడాల పనులు కూడా మొదలవుతాయి. మొత్తానికి బెజవాడకు మంచిరోజులు మొదలైనట్లున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: