పోలవరం ప్రాజెక్ట్ విషయం లో తమకి మొదటి నుంచీ అనుమానం ఉంది అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంది వైకాపా. తమ అనుకూల మీడియా ద్వారా గానీ మరే సాధనం ద్వారా గానీ అనేక ప్రశ్నలు అడుగుతున్నారు ఆ పార్టీ వారు .


అయితే వైకాపా ని ఈ విషయం లో ఎల్లో మీడియా పక్కకి తోస్తూ వచ్చింది. పోలవరం కి సంబంధించి వైకాపా నాయకుడు జగన్ అసంబ్లీ లో సైతం అడిగిన ప్రశ్నలకి ఇప్పటి వరకూ జవాబు లేదు, ఎన్నో ఆధారాలతో ఆ ప్రాంతం లో - కంట్రాక్టర్ లు అన్యాయం చేస్తున్నారు అని వైకాపా అనేకసార్లు మీడియా కి ఎక్కినా పట్టించుకునే నాధుడు లేడు .



మళ్ళీ ఈ విషయం మీద తమ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది వైకాపా ఆ పార్టీ నేత సుబ్బా రెడ్డి మీడియా తో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టా? కాదా? ప్రబుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లు సరిగా పని చేయకపోతే, వారిని టెర్మినేట్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ... సమయాన్ని వృథా చేయడానికి కేంద్ర మంత్రులను కలుస్తున్నారని అన్నారు.



విదేశీ పర్యటన ముగిసిన వెంటనే హడావిడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నితిన్ గడ్కరీ ని కలవడం వెనక జరిగిన జాగ్రత్త ఏంటి ? ఎవరిని కాపాడడానికి ఇదంతా జరిగింది చెప్పాలని ఆయన కోరారు. వీరిద్దరి మధ్య ఏం చర్చ జరిగిందో బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల పేరు చెప్పి, మూడేళ్ల నుంచి సబ్ కాంట్రాక్టర్లతో పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం పనుల్లో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోంది అని అందరికీ తెలిసినా సైలెంట్ గా ఉండడం సిగ్గు చేటు అన్నారు ఆయన.


మరింత సమాచారం తెలుసుకోండి: