ఒక పార్టీలో బ్రహ్మాండంగా ఎదిగిన నాయకుడు పార్టీ ఫిరాయించినప్పుడు అవతలి పార్టీలో ఎదగలేకపోవచ్చు. అప్పుడు అనవసరంగా వచ్చానేమోనని బాధపడాల్సివస్తుంది. తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందేమోనని ఆయన శ్రేయోభిలాషులు, సన్నిహితులు అనుమానిస్తున్నారు.
Image result for tdp
కాంగ్రెసులోకి వెళ్లాలనుకోవడం తొందరపాటు చర్యగా చెబుతున్నారు. తన వెంట వస్తారనుకున్న కొందరు నాయకులు, కార్యకర్తలు అందుకు అంగీకరించకపోవడంతో ఆయన కంగు తిన్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఓడిపోయి పదేళ్లు ప్రతిపక్షంలో ఉంది. ఆ తరువాత రాష్ట్ర విభజన జరగడంతో ఇబ్బందులు పడుతోంది. ఈ దశలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో రేవంత్‌ను బాగా ఆదిరించారు. తనకు సన్నిహితుడిగా భావించారు. సముచిత స్థానం కల్పించారు. 

Image result for telangana

కొంతకాలం క్రితం పార్టీకి రెండు రాష్ట్రాల్లో కొత్త కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు కూడా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిలో రేవంత్‌నే కొనసాగించారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటానికి, ప్రతిపక్షాలతో కలిసి ఉద్యమాలు చేయడానికి తగినంత స్వేచ్ఛ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం జరిగిన సింగరేణి ఎన్నికల్లోనూ టీడీపీ ప్రతిపక్షాలతో కలిసి ప్రచారం చేసింది.

Image result for congress
చంద్రబాబు ఏ విషయంలోనూ రేవంత్‌ను అడ్డుకోలేదు. అయినప్పటికీ ఆంధ్రా నాయకులు తెలంగాణ సీఎంకు ఘన స్వాగతం పలికారని, తెలంగాణలో కాంట్రాక్టులు తీసుకున్నారని, టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోబోతున్నారని...ఇలా పలు కారణాలు చెప్పి కాంగ్రెసులో చేరాలని నిర్ణయించుకున్నాడు. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంటున్నట్లు బాబు అధికారికంగా ప్రకటిస్తే అప్పుడు వ్యతిరేకించి బయటకు పోవచ్చు. దీనిపై కేసీఆర్‌ కూడా ఏమీ మాట్లాడలేదు


టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని మోత్కుపల్లి నర్సింహులు చెప్పింది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. అయినప్పటికీ రేవంత్‌ పెద్ద హంగామా సృష్టించారు. ఇక కాంగ్రెసులో చేరిన తరువాత ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. అదో మహాసముద్రం. 'పీతల సీసాకు మూత అక్కర్లేదు' అనే సామెత  కాంగ్రెసుకు సరిపోతుంది. అక్కడ ఒకరు ఎదుగుతుంటే మరొకరు కాలు పట్టి కిందికి లాగుతుంటారు. ఢిల్లీలో ఉన్న అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం ఎక్కువ. రేవంత్‌ చేరికను చాలామంది సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు.

తమ ఆధిపత్యానికి గండి కొడతాడని భయపడుతుతున్నారు. ఆయనకు ప్రచార కమిటీ ఛైర్మన్‌ పదవి ఇవ్వవద్దని హైకమాండ్‌ను కోరుతున్నారు. టీడీపీలో చంద్రబాబు నాయుడు కళ్ల ఎదరుగా ఉన్నారు. ఆయన్ని స్వేచ్ఛగా కలుసుకొని మాట్లాడే అవకాశం ఉంది. అవసరమనుకుంటే ఏకాంతంగా మాట్లాడి సమస్యలు చెప్పుకోవచ్చు. కాంగ్రెసులో ఇంతటి స్వేచ్ఛ ఉండదు. ఢిల్లీలో పడిగాపులు పడాలి. ఈ లెక్కన చూస్తే రేవంత్‌ తప్పటడుగులు వేస్తున్నాడా? అనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: