కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన  సినిమా "మెర్సల్" పై  రాజకీయ రచ్చ మొదలైంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల ను బీజేపీ వ్యతిరేకిస్తుండగా, కాంగ్రెస్ వాటికి పూర్తిగా మద్దతిస్తుంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ  ప్రత్యక్షంగా రంగం లోకి దిగి, "మెర్సల్"  కు అనుకూలంగా ట్వీట్ చేశారు. ఈ సినిమా రాజకీయ ప్రేరేపణతో వచ్చిందని బీజేపీ ఆరోపిస్తుండటంతో రాహుల్ గాందీ తన బాణాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పైనే గురి పెట్టారు.

Image result for mersal rahul vijay


ఇప్పుడు కాంగ్రెస్ యువరాజు  "మెర్సాల్"  సినిమా పై,  తన అభిమానాన్ని చాటుకున్నారు.  "డియర్, మోడి. సినిమా అనేది తమిళులు తమ సంస్కృతి ని తెలియజెప్పే సాధనం. అంతే కాదు వారి బాషా సంస్కృతిని ప్రతిబింపించేది కూడా సినిమా లోనే.  దానిని మీరు డీ-మోనెటైజేషన్ తరహాలో రద్ధు చేయాలని చూడొద్దు"  అనే అర్థం స్పురించేలా  ట్వీట్ చేసిన రాహుల్, "మెర్సాల్"  సినిమా లో జి.ఎస్.టి పై హీరో  విజయ్ పేల్చిన డైలాగులు తొలగించాలన్న తమిళనాడు బిజెపి డిమాండ్ ను తోసి పుచ్చారు. తమిళుల ఆత్మగౌరవాన్ని రద్దు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Image result for mersal rahul vijay



దీనికి  "ఇందు సర్కార్"  సినీ నిర్మాత మధుర్ భండార్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్, రాహుల్ గాంధీ అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను ఏకి పారేశారు. దేశంలో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ విధించిన 'అత్యవసర పరిస్థితి' (ఎమర్జెన్సీ)  నేపథ్యం లో తాను నిర్మించిన, చిత్రం విషయంలో కాంగ్రెస్ దారుణంగా వ్యవహరించిందని, ఆరోపించారు. రాహుల్ గాంధీ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నారన్నారు.

Image result for madhur bhandarkar about indu sarkar on rahul


ఇందు సర్కార్ లో కొన్ని సన్నివేశాలను, మాటలను, సంభాషణలను మార్చే విధంగా తనపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. వాక్ స్వాతంత్ర్యానికి కొంచెం కూడా విలువ ఇవ్వలేదన్నారు. మధుర్ బండార్కర్ తను తీసిన సినిమాను, అసలు చూడకుండా నే,  బ్యాన్  చేయాలంటూ కాంగ్రెస్ వర్గీయులు కోర్టుకు ఎక్కారు. ఆందోళనలు చేశారు. మరి రాహుల్ గాంధి బుద్ది అప్పుడు ఏమైనట్లో? అంటూ ఉతికి పిండేసి ఆరేశారు. 


Image result for congress negative comments on kamal hassan viswaroopam



అప్పట్లో మహారాష్ట్రలో ఇద్దరు యువతులను పేస్-బుక్ లో బాల్- థాక్రే గురించి వ్యతిరేక కామెంట్లు పెట్టారనే నెపంతో అరెస్ట్ చేయించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. అటువంటి పార్టీ ఇప్పుడు వాక్-స్వాతంత్రం గురించి మాట్లాడుతుంటే చాలా కామెడీ గానే ఉందని జనం కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నెటిజన్లు కూడా రాహుల్‌ గాంధీని ఎద్దేవా చేస్తున్నారు. కమల్ హాసన్ నటించిన "విశ్వరూపం"పై కాంగ్రెస్ మద్దతుదారులు ఎందుకు దాడి చేశారని ప్రశ్నిస్తున్నారు.

Image result for congress govenment arrested two women criticized bal thakre posted in FB


ఇకపోతే 'మెర్సాల్'  సినిమా గురించి ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ, నాయకుడూ ఏదో ఒక అభిప్రాయాన్ని చెబుతూనే ఉన్నారు. ఇదంతా చూస్తుంటే అందరూ తమ తమ పొలిటికల్ మైలేజీల కోసం ఈ సినిమాను ఫుల్లుగా వాడేసుకుంటున్నారనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: