తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలిగిపోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన పార్టీ స్థాపించారు. కొంత కాలంగా ఈ పార్టీ కార్యకలాపాలు పెద్దగా సాగలేదు. తాజాగా పవన్ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడంతో ఆ పార్టీ కార్యక్రమాలు మంచి ఊపు అందుకున్నాయి. అయితే జనసేనకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జనసేన పార్టీ యాక్టివ్ మెంబర్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం నాయకుడు కళ్యాణ్ సుంకర అరెస్ట్ అయ్యాడు. 

ఓఎల్ఎక్స్‌లో ఐఫోన్ 7 అమ్ముతానని పెట్టి డమ్మీ ఫోన్ అమ్మిన కళ్యాణ్ సుంకరను పోలీసులు అరెస్ట్ చేశారు. డమ్మీ ఫోన్ ఎందుకు అమ్మారని ప్రశ్నించిన వ్యక్తిని కళ్యాణ్ సుంకర ఎయిర్ గన్‌తో బెదరించాడు. కళ్యాణ్ దగ్గర నుంచి పోలీసులు ఫోర్డ్ ఎండీవర్ కార్, ఎయిర్ గన్‌ని స్వాధీనం చేసుకున్నారు.

కల్యాణ్ సుంకర పార్టీకి అధికార ప్రతినిధిగా ఉంటూ జనసేన బలోపేతానికి కృషి చేస్తున్నారు. పార్టీ తరపున పలు చానెళ్లలో చర్చల్లోనూ పాల్గొంటున్నారు.తెలుగు రాష్ట్రాల్లో జనసేనను పటిష్టం చేసుకోవాలని ఓ పక్క అధినేత పవన్ కళ్యాణ్ యోచిస్తుంటే ఆ పార్టీకి చెందిన వ్యక్తి అరెస్ట్ కావడం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: