టీటీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంట్రీ తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ హాట్‌గా ప్ర‌కంప‌న‌లు రేపుతోన్న సంగ‌తి తెలిసిందే. రేవంత్ ఎంట్రీని కొంద‌రు టీ కాంగ్రెస్ పెద్ద‌లు స్వాగ‌తిస్తుంటే మ‌రికొంద‌రు మాత్రం వ్య‌తిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే రేవంత్ కాంగ్రెస్‌లోకి వ‌స్తే టీ కాంగ్రెస్‌లో చాలా మందికి వ‌ణుకు పుట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. త‌న‌తో పాటు పార్టీలోకి వ‌స్తోన్న 25 మంది లీడ‌ర్ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి టిక్కెట్లు కేటాయించాల‌ని రేవంత్ స్వ‌యంగా రాహుల్‌గాంధీకే ఓ లిస్ట్ ఇచ్చిన‌ట్టు వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.

revanth reddy కోసం చిత్ర ఫలితం

ఈ జాబితాలో రేవంత్ చెప్పిన‌వాళ్ల‌కు సీటు ఇస్తే త‌మ సీట్ల‌కు ఎక్క‌డ గండిపుడుతుందో ? అన్న టెన్ష‌న్‌లో ప‌లువురు టీ కాంగ్రెస్ పెద్ద‌లు ఉన్నారు. మ‌క్త‌ల్‌లో రేవంత్ మాజీ ఎమ్మెల్యే కొత్త‌కోట ద‌యాక‌ర్‌రెడ్డికి టిక్కెట్ అడుగుతున్నాడు. అయితే ఆ సీటును కాంగ్రెస్ త‌ర‌పున త‌న ఫ్యామిలీలో ఎవ‌రికో ఒక‌రికి ఇప్పించుకోవాల‌ని చూస్తున్నారు. ఇక్క‌డ అరుణ ఆధిప‌త్యానికి చెక్ పెట్టేలా రేవంత్ వ్యూహం ఉంది. 

sambani chandrasekhar కోసం చిత్ర ఫలితం

ఇక వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో మాజీ వేం న‌రేంద‌ర్‌రెడ్డితో రాజేంద‌ర్‌రెడ్డికి, నిజామాబాద్ రూర‌ల్‌లో అరికెల న‌ర్సారెడ్డితో మాజీ ఎమ్మెల్యే ఆకుల ల‌లిత‌కు రేవంత్ షాక్ ఇచ్చేలా ఉన్నాడు. భూపాల‌ప‌ల్లిలో గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌తో మాజీ విప్ గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డికి షాక్ త‌ప్పేలా లేదు. స‌త్తుప‌ల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య రేవంత్‌తో పాటు పార్టీ మారితే అక్క‌డ మాజీ మంత్రి సంభాని చంద్ర‌శేఖ‌ర్ కెరీర్ ఫ్యూచ‌ర్ ముగిసిన‌ట్టే.

ramreddy damodar reddy కోసం చిత్ర ఫలితం

ఇక దేవ‌ర‌కొండ‌లో బిల్యానాయ‌క్‌, సూర్య‌పేట‌లో ప‌టేల్ ర‌మేష్‌రెడ్డి రేవంత్ వ‌ర్గంతో పార్టీ మారితే ఈ రెండు చోట్ల జ‌గ‌న్ లాల్‌నాయ‌క్‌, మాజీ మంత్రి రాంరెడ్డి దామోద‌ర్‌రెడ్డికి టిక్కెట్ కోసం ఫైట్ చేయ‌క‌త‌ప్ప‌దు. బాల్కొండ‌లో రాజారాం య‌ద‌వ్‌కు ప్ర‌యారిటీ ఇస్తే మాజీ ఎమ్మెల్యే అనిల్ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌ర‌మే. ఇక మునుగోడులో కంచ‌ర్ల భూపాల్‌రెడ్డి పేరును రాహుల్‌కు ఇచ్చిన లిస్టులో ఉండ‌డంతో పాల్వాయి ఫ్యామిలీకి ఇక్క‌డ చెక్ త‌ప్ప‌దు.  రేవంత్ కాంగ్రెస్ ఎంట్రీ చాలామంది సీనియ‌ర్ కాంగ్రెస్ లీడ‌ర్ల పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌కు ప్ర‌శ్న‌గా మారింది.

gandra venkataramana reddy కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: