వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్‌కు ఇప్ప‌టికే 21 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల‌తో పాటు ప‌లువ‌రు నాయ‌కులు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు షాకుల మీద షాకులు ఇస్తూ అధికార టీడీపీలోకి జంప్ చేసేస్తున్నారు. నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల త‌ర్వాత జ‌గ‌న్ క్రేజ్ రోజు రోజుకు త‌గ్గుతుంటే, వైసీపీ ఇమేజ్‌కు భారీ డ్యామేజ్ జ‌రిగింది. ఈ నేప‌థ్యంలోనే ప‌లువురు వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయ‌కులు కూడా పార్టీ మారేందుకు కూడా రెడీ అయిపోతున్నారు.

mla ramireddy pratapkumar reddy కోసం చిత్ర ఫలితం

ఇక పార్టీలో ఉన్న‌వారిలో కూడా చాలామందికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్లు వ‌స్తాయో ?  రావో ?  తెలియ‌క తీవ్ర ఆందోళ‌న‌తో ఉన్నారు. ఇటీవ‌ల పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయిన క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక‌కు జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీ టిక్కెట్‌పై హామీ ఇవ్వ‌క‌పోవ‌డంతోనే ఆమె వైసీపీకి బై చెప్పినట్టు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక సీనియ‌ర్లు అయిన మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి లాంటి వాళ్ల‌కు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ వ‌స్తుందా ?  రాదా ? అన్న‌ది క్లారిటీ లేక వాళ్లు త‌మ బాధ‌ను ఎవ్వ‌రికి చెప్పుకోలేక స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ట‌.


ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ వ‌స్తుందో ?  రాదో అన్న డౌట్‌తో ఉన్న ఓ ఎమ్మెల్యే కూడా త‌న‌కు 2019 ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే సీటుపై బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోతే త‌న‌దారి తాను చూసుకుంటాన‌ని జ‌గ‌న్‌కు అల్టిమేటం జారీ చేసిన‌ట్టు టాక్‌. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్ర‌తాప్‌రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో టిక్కెట్ కోసం మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డితో పోటీప‌డ్డారు. అయితే ఆ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అంత‌కుముందు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన ప్ర‌తాప్‌కుమార్‌రెడ్డికే టిక్కెట్ ఇచ్చారు.

ys.jagan కోసం చిత్ర ఫలితం

పార్టీ అధికారంలోకి వ‌చ్చాక విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. పార్టీ అధికారంలోకి రాక‌పోవ‌డంతో ఆ హామీ నెర‌వేర‌లేదు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ త‌న‌కే టిక్కెట్‌పై హామీ ఇచ్చార‌ని విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై సీరియ‌స్‌గా ఉన్న ఎమ్మెల్యే ప్ర‌తాప్‌కుమార్‌రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ త‌న‌కే టిక్కెట్ ఇస్తాన‌ని పాద‌యాత్ర ప్రారంభ‌మ‌య్యేలోగా ఓపెన్‌గా ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోతే త‌న‌దారి తాను చూసుకుంటాన‌ని పార్టీ ప‌రిశీల‌కుడు, ఒంగోలు ఎంపీ వైవి.సుబ్బారెడ్డి ద్వారా జ‌గ‌న్‌కు వ‌ర్త‌మానం పంపార‌ట‌. 


దీంతో ఇప్పుడు జ‌గ‌న్‌కు కావలి మ్యాట‌ర్ ముందునుయ్యి వెన‌క‌గొయ్యిగా మారింది. రామిరెడ్డికి టిక్కెట్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించ‌క‌పోతే ఆయ‌న టీడీపీలోకి దూకేయ‌డానికి రెడీగా ఉన్నారు. ఇక ఆయ‌న‌కే టిక్కెట్ అని చెపితే విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి పార్టీ మారేందుకు సై అంటున్నారు. దీంతో ఇప్పుడు ఎలా చూసుకున్నా కావ‌లిలో ఏదో ఒక వికెట్ ప‌డ‌డానికి రెడీగా ఉన్న‌ట్టే అక్క‌డ పొలిటిక‌ల్ వాతావ‌ర‌ణం క‌న‌ప‌డుతోంది.
 
 
 yv subba reddy కోసం చిత్ర ఫలితం
 


మరింత సమాచారం తెలుసుకోండి: