జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం ఖ‌రారైంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోను పోటీ చేస్తాన‌ని ప‌వ‌న్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. జ‌న‌సేన ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుందా ?  లేదా ఒంట‌రిగా పోటీ చేస్తుందా ? అన్న‌ది ఇంకా క్లీయ‌ర్ పిక్చ‌ర్ అయితే రాలేదు. ఇక ప‌వ‌న్ మాత్రం తాను వ‌చ్చే ఎన్నికల్లో అనంత‌పురం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తీరుతాన‌ని ప్ర‌క‌టించారు.

janasena logo కోసం చిత్ర ఫలితం

దీంతో ప‌వ‌న్ అనంత‌పురం జిల్లాలోని అనంత‌పురం అర్బ‌న్‌, గుంత‌క‌ల్లు, క‌దిరి నుంచి పోటీ చేస్తార‌ని ఎవ‌రికి వారు ఊహించుకున్నారు. మీడియా వాళ్లు వార్త‌లు కూడా రాసేసుకున్నారు. ప‌వ‌న్ అనంత‌పురం జిల్లా నుంచి పోటీ చేస్తాన‌న్న ప్ర‌క‌ట‌న‌తో ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల పేర్లు ప్ర‌ధానంగా తెర‌మీద‌కు వ‌చ్చాయి. ప‌వ‌న్ ఈ ఒక్క ప్ర‌క‌ట‌న త‌ర్వాత మ‌ళ్లీ ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేదు. అయితే ఇప్పుడు ప‌వ‌న్ పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గంపై మ‌రో టాక్ న‌డుస్తోంది.


జ‌న‌సేన వ‌ర్గాల్లో జ‌రుగుతోన్న చ‌ర్చ‌ల ప్ర‌కారం ప‌వ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న సొంత జిల్లా అయిన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని పాల‌కొల్లు లేదా న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక నియోజ‌క‌వర్గం నుంచి పోటీ చేస్తాడ‌ని తెలుస్తోంది. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోను ప‌వ‌న్ సొంత సామాజిక‌వ‌ర్గ‌మైన కాపుల ఓటు బ్యాంక్ బ‌లంగా ఉంది. ఇక్క‌డ బీసీల్లో బ‌లంగా ఉన్న శెట్టిబ‌లిజ‌ల్లో కూడా ప‌వ‌న్ ప‌ట్ల సానుభూతి ఉంది.

anantapur railway station కోసం చిత్ర ఫలితం

ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌వ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం న‌ర‌సాపురం కాగా, పక్క‌నే ఉన్న పాల‌కొల్లులో చిరు గ‌తంలో పోటీ ఓడిపోయారు. దీంతో ప‌వ‌న్ ఇప్పుడు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచి స‌త్తా చాటాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ చేస్తాడా ?  లేదా రెండు నియోజ‌క‌వ‌ర్గాలు ఎంచుకుంటాడా ? అన్న‌ది కూడా క్లారిటీ లేదు.


గతంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టి ఎన్నిక‌ల్లో పోటీ చేసిన‌ప్పుడు ఏకంగా మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేశారు. ఇక ప‌వ‌న్ అన్న చిరు కూడా ప్ర‌జారాజ్యం నుంచి పోటీ చేసిన‌ప్పుడు పాల‌కొల్లు, తిరుప‌తిలో పోటీ చేసి తిరుప‌తిలో గెల‌వ‌గా, పాల‌కొల్లులో ఓడిపోయాడు. ఇప్పుడు సొంత జిల్లాతో పాటు వెన‌క‌ప‌డిన అనంత‌పురం జిల్లాలోనూ పోటీ చేస్తాడా ?  లేదా ఒక్క‌చోటే పోటీ చేస్తాడా ? అన్న‌ది క్లారిటీ లేదు. జ‌న‌సేన వ‌ర్గాల ఇంట‌ర్న‌ల్ టాక్ ప్ర‌కారం అనంత‌పురం జిల్లా అయితే త‌న‌కు అంత సేఫ్ కాద‌ని, తాను ఎన్నిక‌ల్లో రెండు రాష్ట్రాల్లోను ప‌ర్య‌టించాల్సి ఉండ‌డంతో త‌న సొంత జిల్లా అయితేనే సేఫ్ అన్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా ప‌వ‌న్ పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గంపై ప‌వ‌న్ కూడా డైల‌మాలో ఉన్న‌ట్టే తెలుస్తోంది.

palakollu railway station కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: