ఇప్పుడు అందరి తెలంగాణపై కాంగ్రేస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేదానికన్నా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏంచేస్థారు దానిపై వుంది. తెలంగాణపై ఎటువంటి నిర్ణయం వెలుబడుతుందా... లేదా అన్నది పక్కనబెడితే అదేదో సిఎం కు అయితే మంగళవారమే చెప్పేస్థారన్నది ఖాయం. తదనంతరం కిరణ్ ఏం చేస్తారన్నది కీలకం. 

దానిపైనే రాజకీయ పరిస్థితుల ఆధారపడి వుంటాయి. ప్రతికూల నిర్ణయం చేస్తే, రాజీనామా చేస్తారా అన్నది ఓ ప్రశ్న. అయితే ఇక్కడో లాజక్ వుంది. రాష్ట్రాన్ని రెండుగా విభజించే ప్రక్రియ ప్రారంభమైతే, ఇక ముఖ్యమంత్రి పదవి నామమాత్రమే. మంత్రిపదవులు అంతంతమాత్రమే. అలాంటపుడు వీరి రాజీనామాలను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకోకపోవచ్చు.

ఇది దృష్టిలో వుంచుకుని వీరు రాజీనామాలు కూడా చేయకపోవచ్చు.నిజానికి తెలంగాణాపై ఎటువంటి నిర్ణయం వెలుబడక ముందే రాజీనామా చేస్థానని కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు వార్థలు వెలుబడ్డాయి. అంటే మంగళవారం సిడబ్ల్యూసి సమావేశానికి ముందే సిఎం ఏదైనా సంచలనాత్మక నిర్ణయం తీసుకోవాలన్న మాట.

అక్కడే సోనియాకు పార్టీకి కూడా రాజీనామా చేస్థున్నట్ల్ లేఖ ఇస్థారా.. లేదా రాష్ట్రానికి వచ్చి గవర్నర్ కు సిఎం పదవికి మాత్రమే రాజీనామా చేస్థున్నట్లు పత్రాన్ని ఇచ్చి పార్టీలో కొనసాగుతారా అన్నది చూడాల్సి వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: