టీటీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి త‌ట్టాబుట్టా స‌ర్దుకుంటున్నారు. కాంగ్రెస్‌లోకి ఓ ఫైన్ డే ఆయ‌న చేరిపోతున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌రకు ఆయ‌న చేసిన హంగామా ఎవ‌రు చేస్తారు?  కేసీఆర్‌పై ఎవ‌రు ఫైరైపోతారు?  రేవంత్ రేంజ్‌లో ఎవ‌రు ఫైట్ చేస్తారు? ఇప్ప‌డు ఇవే ప్ర‌శ్న‌లు తెలంగాణ‌లో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అంద‌రి వేళ్లూ ఒక‌రి వైపు చూపిస్తున్నాయి. అంద‌రూ ఆయ‌న గురించే చ‌ర్చించుకుంటున్నారు. ప్ర‌ధానంగా రేవంత్‌పై రెండు రోజులుగా తీవ్ర స్థాయిలో ఫైరైపోతున్న మోత్కుప‌ల్లి న‌ర్సింహులు గురించే అంద‌రూ ఆలోచిస్తున్నారు. నిజానికి రేవంత్ టీటీడీపీ స‌మావేశంలోనే రేవంత్‌పై ఫైర్ అవ‌డంతోపాటు వాకౌట్ కూడాచేశార‌నే వార్త‌లు వ‌చ్చాయి. 

revanth reddy కోసం చిత్ర ఫలితం

దీంతో రేవంత్ ప్లేస్‌ని మోత్కుప‌ల్లి.. రీప్లేస్ చేస్తారా? అని అంద‌రూ అనుకుంటున్నారు.  నిజం చెప్పాలంటే, ఆయ‌న లక్ష్యం కూడా ఇదే అంటున్నారు విశ్లేష‌కులు. రేవంత్ రెడ్డి త‌న‌కంటే జూనియ‌ర్ కాబ‌ట్టి, ఆయ‌న అండ‌ర్ లో ప‌నిచేయ‌డం మోత్కుప‌ల్లికి అస్సలు ఇష్టం లేదని, అందుకే, రేవంత్ ని బ‌య‌ట‌కి లాగార‌ని అంటున్నారు. గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి రాలేదు, రాజ్య‌స‌భ సీటు వ‌స్తుందో రాదో అనుమానం. కాబ‌ట్టి, టీ టీడీపీలో మ‌ళ్లీ ప్రాధాన్య‌త పెంచుకోవ‌డం ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు అవ‌స‌రం. ఈ క్ర‌మంలో చాలావ‌ర‌కూ మోత్కుప‌ల్లి విజ‌యం సాధించారనే చెప్పాలి. అయితే, పెంచుకున్న ప్రాధాన్య‌త‌తోపాటు భ‌విష్య‌త్తులో పార్టీప‌రంగా ఎదురు కాబోతున్న ప‌రిణామాల‌కు కూడా ఆయ‌న బాధ్య‌త వ‌హిస్తారా? అనేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది.

motkupalli narasimhulu కోసం చిత్ర ఫలితం

 తెలంగాణ‌లో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకోవ‌డం మోత్కుప‌ల్లి ఇష్టం లేదు. అలాంటప్పుడు ఒంటరి పోరాటం చెయ్యొచ్చు. కానీ, కేసీఆర్ తో పొత్తు కోసం ఇప్పుడు మోత్కుప‌ల్లి వెంప‌ర్లాడుతుండ‌డం గ‌మ‌నార్హం. అయితే, గ‌తంలో కేసీఆర్ అంటే చాలు, ఒంటికాలిపై  విమ‌ర్శించే మోత్కుప‌ల్లి ఇప్పుడు ఆయ‌న‌తో పొత్తుకు సిద్ధం అవుతుండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.  కేసీఆర్‌తో దోస్తానా ఎందుకయ్యా అంటే.. కాంగ్రెస్ కు తాము బ‌ద్ధ వ్య‌తిరేకులం అని మోత్కుప‌ల్లి అంటున్నారు. కానీ, గ‌తంలో ఆయ‌న కాంగ్రెస్ లో కూడా ప‌నిచేశారు. 


పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశాల నుంచీ రాగానే రేవంత్ రెడ్డి అంశానికి ఏదో ఒక ముగింపు వ‌స్తుంది. కానీ, ఆ త‌రువాత తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీకి మోత్కుప‌ల్లే బాధ్య‌త వ‌హించాల్సి వ‌స్తుంది. ఒక‌వేళ పార్టీ త‌ర‌ఫున పెద్ద‌న్న పాత్ర‌ను మోత్కుప‌ల్లి పోషిస్తే… ఆయ‌న్ని ఎవ‌రు న‌మ్ముతారు?  ఎలా న‌మ్ముతారు? అనే ప్ర‌శ్న‌లు కూడా వ‌స్తున్నాయి. ఎలా చూసినా.. తెలంగాణాలో కొన ఊప‌రితో ఉన్న తెలుగుదేశం పార్టీకి మొత్తంగా గండిప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది.  రేవంత్ ను విమ‌ర్శించినంత ఈజీగా పార్టీని నిల‌బెట్ట‌డం ఆయ‌న‌కు సాధ్య‌మౌతుందా..?  అనేది కూడా నూరు డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

tdp logo కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: