వైఎస్సార్ సిపి కి గుడ్ బై చెప్పిన ఆపార్టీ తెలంగాణ ప్రాంత కీలక నేత మూడు నెలలు ముందుగానే  ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  జగన్ వైఖరితో విసిగిన కొండా, కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయించుకుని, ఆ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి రహస్య సందేశాన్ని పంపించినట్లు కాంగ్రేస్ వర్గాల సమాచారం. తాను జగన్ పార్టీ వైఖరితో విసిగిపోయానని తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నాననిఅనుమతించాలన్నది ఈ సందేశం సారాంశంగా తెలుస్తోంది.

కొండా సురేఖ అక్కడితో ఆగకుండా, తాను ఇన్నాళ్లూ కాంగ్రెస్ పట్ల వ్యవహరించిన తీరుకు క్షమించాలని కూడా కోరిందని సమాచారం. తాను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అండగా ఉన్న మాజి పిసిసి అద్యక్షుడు డి. శ్రీనివాస్ మద్యవర్తిగా కొండా సురేఖ కాంగ్రెస్ అధిష్టానంతో రాయబారం నడిపినట్లు తెలుస్తోంది. కొండా లేఖ మేరకు కాంగ్రెస్ అధినేత్రి  సోనియాగాంధీ కూడా సరే అని ఒప్పుకోవడమే కాకుండా వరంగల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని కూడా సోనియా సూచించిందని చెబుతున్నారు.

అయితే ఎలాంటి కారణం లేకుండా జగన్ పార్టీని  వీడితే ప్రజల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుందనిసరైన కారణం కోసం వేచిచూసి దొరికిన వెంటనే పార్టీలోకి జంప్ అయినట్లు తెలుస్తోంది. ఫైర్ బ్రాండ్ రాజకీయనాయకురాలిగా కొండా సరేఖకు వరంగల్ ప్రాంతంలో మంచి ఇమేజే వుంది. ఇప్పుడు అది కాంగ్రెస్ కు ప్లస్సవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: