రాజకీయాల కోసం నాయకులు ఎంతకైనా తెగిస్తారు... పదవిలో ఉన్నా లేకపోయినా ఓట్ల కోసం జనం సెంటిమెంట్ తో ఆటాడుకుంటారు. అదీ ఎన్నికల సమయంలో అయితే చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అదే పనిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం సమీపిస్తున్న సమయంలో సిద్ధరామయ్య కన్నడ సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కర్ణాటకలో ఉండే వాళ్లంతా కన్నడ నేర్చుకోవాల్సిందేనట.

కన్నడ రాజ్యోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన కన్నడ భాష గొప్పతనాన్ని వివరించారు. అంతవరకూ ఓకే.. అయితే ఓ అడుగు ముందుకేసి కాస్త వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ఉండేవాళ్లంతా తమ పిల్లలకు ఖచ్చితంగా కన్నడ నేర్పాల్సిందేనన్నారు. లేకపోతే అది తమ భాషను అవమానించినట్లేనన్నారు. 


సిద్ధరామయ్య కన్నడ సెంటిమెంట్ గొడవను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మెట్రో బోర్డులపై హిందీ సైన్ బోర్డులకు వ్యతిరేకంగా కన్నడ సంఘాలు ఇటీవల ఆందోళనకు దిగాయి. వెంటనే సీఎం రంగంలోకి దిగారు. బోర్డులను రీడిజైన్ చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. హిందీని తొలగించాలని డిమాండ్ చేశారు.

ఈ మధ్యే రాష్ట్రానికి ప్రత్యేక జెండా అంటూ మరో డ్రామాకు తెరతీసారు. కర్ణాటకలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పై ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉంది. దాన్నుంచి నెగ్గుకురావడానికి సిద్ధరామయ్య కన్నడ సెంటిమెంట్ ను వాడుకుంటున్నారు. ఈ సెంటిమెంట్ ఓట్లు కురిపిస్తుందో లేదో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: