సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ అనేక సందర్భాల్లో ఈ దేశాన్ని జవహర్ లాల్ నాయకత్వం లోని కాంగ్రెస్ కభందహస్తాల పట్టు నుండి తప్పించారు. పటేల్ భారత్ విషయంలో సుధీర్ఘ దృష్టితో సుదూర లక్ష్యాలతో పనిచేశారు. ఎంతదూరాన్నైనా ఊహించగల దిట్ట సర్దార్ పటేల్. అనుక్షణం దేశం కోసమే పరితపించిన ధన్యజీవి సర్దార్. ఆయన సలహాలు పాటించని జవహర్ లాల్ ఏ ఏ సందర్భాల్లో పాటించలేదో అవే నేడు జాతికి తీవ్య సమస్యలై కూర్చున్నాయి. వాటిని కప్పి పెట్టి పటేల్ గురించి చరిత్రనే లేకుండా చేసింది కాంగ్రెస్. అలా పటేల్ సలహా పాటించని సందర్భం


*పాకిస్థాన్ కు ఏభై ఐదు కోట్ల రూపాయలు యివ్వటం.

*అలాగే కాశ్మీర్ ను నైజాం రాష్ట్రం, జునాగడ్ సంస్థానాల్లాగా భారత్ లో వీలీనం చేయనివ్వకపోవటం 


నాటి బ్రిటిష్ భారత అధినేత లార్డ్ మౌంట్ బాటెన్ మాటలు పూర్తిగా విశ్వసించిన జవహర్ నెహౄ సర్దార్ వల్లబ్ భాయ్ పటెల్ సలహాలను లక్ష్య పెట్తకపోవటం దేశాన్ని రావణకాష్ఠంలా చల్లార్చలేని సమస్యల్లోకి నెట్టివేశాయి, అగ్గిని రగిల్చిపెట్టాయి. 

Image result for lord mountbatten family with nehru  

రెండు నెలలకు పైగా భారత్-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన డోక్లాం సంక్షోభం ఆ తర్వాత సద్దుమణిగినప్పటికీ ఇలాంటి ఉపద్రవం రావచ్చని ఉక్కుమనిషి, దేశ తొలి గృహ మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 1950 లోనే ఊహించి చెప్పారట. ఈ విషయాన్ని ఒక లేఖలో అప్పటి ప్రధాని పండిట్ జవహర్‌ లాల్ నెహ్రూ దృష్టికి తీసుకు వచ్చారట. పటేల్ జయంత్యుత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి, రక్షణ శాఖ మాజీ మంత్రి మనోహర్ పారికర్ ఈ విషయాలు వెల్లడించారు.


తాను రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు సర్దార్ పటేల్‌ గురించి చాలా విషయాలు తెలుసుకున్నానని పారికర్ తెలిపారు. నిజానికి చైనా, పాకిస్థాన్‌లో జరిగిన యుద్ధాలను సైతం సర్దార్ పటేల్ ముందుగానే ఊహించారని, నెహ్రూకు సర్దార్ పటేల్‌ రాసిన మూడు పేజీల లేఖలో ఆ విషయాలు ఉన్నాయని అన్నారు. నెహ్రూకు రాసిన లేఖల్లో ఒక లేఖ తాను చదవానని పారికర్ వెల్లడించారు. 


'1965 ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధం, 1962లో చైనాతో జరిగిన యుద్ధాన్నే కాకుండా డోక్లాం సంక్షోభాన్ని కూడా 1950లోనే పటేల్ ఊహించారు. ఆయన చాలా సునిశిత బుద్ధి, కచ్చితత్వం గల వ్యక్తి' అని అన్నారు. కశ్మీర్‌ కల్లోలిత పరిస్థితికి కూడా అప్పట్లో సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ అభిప్రాయాలను పట్టించుకోకపోవడమే కారణమని మనోహర్ పారికర్ నిశ్చితా భిప్రాయం వ్యక్తం చేశారు.

Related image

భారత చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్-బాటన్ కుటుంబం తో మన నెహౄ

మరింత సమాచారం తెలుసుకోండి: