ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు ఓ మామూలు ట్విట్టర్ ఉద్యోగి షాక్ ఇచ్చాడు. ఏ స్థాయిలో అంటే అటు వైట్ హౌస్, ఇటు ట్విట్టర్ కార్యలయం ఫోన్లు రింగ్ సౌండ్ లతో మార్మోగిపోయాయి. కోపంతో చేశాడో లేక సరదాగా చేశాడో కానీ కాసేపు ట్రంప్ ట్విట్టర్ ఎకౌంట్ ను బ్లాక్ చేసి నెటిజన్లను అయోమయంలోకి నెట్టేశాడు.  గురువారం నాడు ట్రంప్ ట్విట్టర్ పేజ్ ను ఓపెన్ చేసిన వారికి  దిస్ పేజ్ డజ్ నాట్ ఎగ్జిస్ట్ అని వచ్చింది. దీంతో ఏం జరిగిందో జనానికి అర్థం కాలేదు.

Image result for twitter

అమెరికా అధ్యక్షుడి అధికారిక ఖాతా ఇలా కాసేపు మాయం కావడంతో అందరూ ఏదో జరిగిందని అనుమానించారు. ఏం జరిగిందో కనుక్కోవడానికి ప్రయత్నించారు. కాసేపటి తర్వాత విషయం గుర్తించిన ట్విట్టర్ వెంటనే తప్పిదాన్ని సరిదిద్దుకుంది. మానవ తప్పిదం వల్ల అలా జరిగిందని మొదట వివరణ ఇచ్చింది ట్విట్టర్. తర్వాత అసలు విషయం బయటపడింది. ఓ కస్టమర్ సపోర్ట్ ఎంప్లాయ్ ఇలా చేశాడని దర్యాప్తులో తేలింది. పైగా ఉద్యోగిగా ట్విట్టర్ లో అతనికి అది చివరిరోజు. అందుకే కావాలనే ట్రంప్ కు షాక్ ఇచ్చినట్లు భావిస్తున్నారు.


ఒక్కసారిగా ట్రంప్ ట్విట్టర్ ఎకౌంట్ పనిచేయకపోవడంతో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఉత్తరకొరియాపై యుద్ధానికి సిద్ధమని ప్రకటించినప్పటి నుంచి ట్రంప్ ఎకౌంట్ సస్పెండ్ చేయాలని చాలా విజ్ఞప్తులు వచ్చాయి. అలాంటిదేమైనా జరిగిందేమోనని ఓ అనుమానం. ట్రంప్ ఏ మాత్రం సెక్యూరిటీ లేని ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారన్న వార్తలున్నాయి.


దీంతో ఎవరైనా దాన్ని హ్యాక్ చేశారేమోనంటూ మరో ఊహాగానం. ట్రంపే ఎవరిమీదో కోపంతో ట్విట్టర్ నుంచి వెళ్లిపోయారని మరో కథ.. మొత్తానికి ఎకౌంట్ సస్పెండ్ అయ్యింది కేవలం 11నిముషాలు..కానీ ఊహాగానాలు మాత్రం బోలెడు.. అయితే ఓ చిన్న ఉద్యోగి ఈ స్థాయి షాక్ ఇవ్వడంపై ట్రంప్ వ్యతిరేకుల్లో మాత్రం సంతోషం వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: