అవినీతి కి సంబంధించి సౌదీ రాజు అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కాస్త సీరియస్ గా ప్రవర్తిస్తూ ఉన్నారు. 11 మంద యువరాజులతో పాటు నలుగురు మంత్రులు అనేకమంది మాజీ మంత్రుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం పెద్ద చర్చ కి దారి తీస్తోంది అవినీతికి పాల్పడ్డవారి జాబితాతో ఆ కమిటీ రాజుకు నివేదికను ఇచ్చింది.

అనంతరం అవినీతికి పాల్పడ్డ వీరందరినీ అరెస్ట్ చేయాలంటూ రాజు ఆదేశాలు జారీ చేశారు. ఈ వివరాలను అల్-అరేబియా టీవీ వెల్లడించింది.దివంగత రాజు అబ్దుల్లా కుమారుడైన యువరాజు మితెబ్ ను అత్యంత శక్తిమంతమైన నేషనల్ గార్డ్స్ పదవి నుంచి సల్మాన్ తొలగించారు.

ప్రపంచం లోనే సంపన్నుడు అయిన యువరాజు అల్వాలీద్ బిన్ తలాల్ కూడా అరెస్ట్ అయినవారిలో ఉండడం షాకింగ్ విషయం. ఈయన కి ట్విట్టర్ లో సిటీ గ్రూప్ లో కూడా వాటాలు ఉన్నాయి. 

"ప్రజా ధనాన్ని దోచుకున్నవారు, దాన్ని కాపాడలేక పోయినవారు, తమ పదవులను అక్రమాలకు వాడుకున్నవారు ఎవరైనా సరే చట్ట ప్రకారం శిక్షించబడతారు. చిన్నవారైనా, పెద్దవారైనా ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు", అంటూ సల్మాన్ స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: