హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని. మరి దాని ఆలనా పాలనా ఎవరు చూస్తారు? తెలంగాణా సిఎమ్ లేదా ఆంధ్ర సిఎమ్. ఈ రెండూ కాకుంటే గవర్నర్?  . ప్రత్యేక తెలంగాణను ప్రకటించిన కాంగ్రేస్ హైదరాబాద్ ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని నిర్ణయించింది. హైదబారాద్ పూర్తిగా గవర్నర్ అజమాయిషిలోనే ఉంచాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది,.

దీంతో ఒకప్పుడు నిజాంనవాబులు ఏలిన చారిత్రక నగరానికి గవర్నర్ నరసింహన్ కొత్త నవాబుగా అవతరించనున్నారు. ఆ మద్య నరసింహన్ ను ఢిల్లీ పిలిపించుకున్న సోనియా అప్పుడే ఈవిషయం ఆయనకు వివరించినట్లు సమాచారం. గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతిని కూడా కలిసి హైదరాబాద్ ను ఎలా పాలించాలిఎలాంటి నిర్ణయాలు తెలుసుకోవాలి

రాష్ట్రపతి సలహాలను ఎప్పటికప్పుడు ఎలా పాటించాలి అన్న విషయాలపై కూడా పూర్థి సమాచారాన్ని తీసుకున్నారని అంటున్నారు.ఈ సంగతి పక్కన పెడితే, హైదరాబాద్ యంత్రాంగం అంతా అయోమయంగా తయారవడం ఖాయం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైదరాబాద్ మేయర్,

పాలన బాధ్యతలు చూసే గవర్నర్? ఇంతమంది నడుమ ఎవరి అధికారం ఏమిటో తెలియక బోలేడు తికమక. అన్నట్లు రెండు రాష్ట్రాలు వుంటే ఇద్దరు గవర్నర్లు వుండాలిగా.మరి ఆయనెవరో?

 

మరింత సమాచారం తెలుసుకోండి: