విజయవాడ ఎంపి లగడపాటి అంటేనే మాటలు చాలా చిత్రంగా వుంటాయి.. మాటలు మార్చి మభ్యపెట్టడంలోను ఆయనకు ఆయనే సాటి. తెలంగాణ ఇస్థే రాజకీయ సన్యాసం చేస్థాను,ఇవ్వకుండా అడ్డుకుంటాను అని బీరాలు పలికిన లగడపాటి తీరా కాంగ్రేస్ తెలంగాణ ప్రకటించాక అదంతా వేస్ట్ అసలా బిల్లు ఎలా ఆమోదం పొందుతుంది అంటూ రాజకీయసన్యాసం .

చేయకుండా తప్పించుకునేందుకు మతిలేని మాట్లాడుతున్నారు ఇప్పటికీ ఇంకా తెలంగాణాను అడ్డుకుంటామంటున్నారు.
సరే కాస్సేపు లగడపాటి మాటలు నిజమే అనుకుందాం అలాంటప్పుడు ఆయన తెలంగాణను అడ్డుకుంటానని ఎలా చెబుతున్నారో విందాం. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం మంది 290 ఎమ్మెల్యేలు ఉండగా బిల్లు పెడితే సీమాంద్రకు చెందిన 180 మంది

వ్యతిరేకిస్థారని దీంతో మెజార్టీ సభ్యులు తెలంగాణ వద్దంటున్నందుకు కాంగ్రేస్ ప్రజాస్వామ్యానికి విలువ ఇస్థుంది కాబట్టి 
తెలంగాణ ఏర్పాటు ఆపేస్థుంది అంటూ ఇప్పుడు కొత్తకహాని చెబుతున్నాడు.
కానీ, రాజ్యాంగంలో వున్న అనుకూల పరిమితుల ప్రకారం దిగ్విజయ్ సింగ్ ఏమన్నారు,అసెంబ్లీలో తీర్మాణానికి ప్రవేశపెడతాం

అది సక్సెస్ అయినా వీగిపోయినా సంబందం లేదు,లోక్ సభరాజ్యసభలో ఆర్టికల్ 371 డి కింద సాధారణ మెజారిటీతో ఆమోదించి రాష్ట్రపతికి పంపిస్థాం అంటున్నారు.  అది సరేఆయన ఎంపీగా ఉన్న లోక్ సభలో తెలంగాణ బిల్లును అడ్డుకోలేని పరిస్థితి వుందా? ఇదంతా తెలిసిన వాళ్లు లగడపాటి మాటలనువైఖరిని చూసి ఏమనుకుంటారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: