మైనారిటీ - మెజారిటీ అనే పాలన లో సాగే దేశం మనది. ఆయా ప్రభుత్వాలు ఎప్పుడెప్పుడు మైనారిటీ ల కోసం ఏం చేస్తాయా అని ఎప్పటికప్పుడు మీడియా ఒక కన్ను వేసే ఉంచుతుంది . రీసెంట్ గా మజ్లిస్ నేత అక్బరుద్దీన్ తెరాస ని మైనారిటీ ల ఆత్మ బంధువు గా మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా పొగడ్తల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మండిపడ్డారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే పార్టీ ఎంఐఎం అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాయడం, ఆ పార్టీ సీఎంలను భుజాలకు ఎత్తుకోవడం ఎంఐఎం నేతల పని అని విమర్శించారు. 

" ఎప్పుడు ఏ పార్టీ అధికారం లోకి వస్తే ఆ పార్టీ కాళ్ళు నొక్కుతూ కూర్చుంటారు వీళ్ళు. ఆస్తుల్ని కూడబెట్టుకోవడం ఒక్కటే వీరికి లెక్క తప్ప మైనారిటీ ల మంచిని ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదు ఈ పార్టీ పెద్దలు. మతోన్మాదం పెంచడం కోసమే మజ్లిస్ - తెరాస పొత్తు పెట్టుకునేలా ఉన్నాయి " అన్నారు కిషన్ రెడ్డి.

అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలోనే... ఎన్నికల్లో కలసి పోటీ చేసి, గెలుస్తామంటూ అక్బరుద్దీన్ వ్యాఖ్యానిస్తున్నప్పటికీ, కేసీఆర్ మౌనంగానే కూర్చున్నారని... ఆయన మౌనానికి అర్థం ఏమిటని ప్రశ్నించారు. దీనికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉందని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: