తమిళనాడులో ఒక్కసారిగా అనూహ్య పరిణామాలు ఏర్పడుతున్నాయి. మన్నారుగుడి మహా సామ్రాజ్యధినేత శశికళ సంస్థానం మీద ఒక్కసారిగా ఆదాయపన్న శాఖ తమ దాడులతో విరుచుకుపడింది. ఆమె రాజకీయ, వ్యాపార, విపణి, పారిశ్రామిక సామ్రా జ్యంపై ఐటి శాఖ నిర్విరామగా దాడులు నిర్వహిస్తుంది. 

Related image

తమిళనాడులోని శశికళ వ్యాపార సామ్రాజ్యానికి ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు ధారుణంగా షాకిచ్చారు. జయ టీవీ, డాక్టర్ నమధు ఎంజీఆర్ దినపత్రిక సహా అన్నా డీఎంకే లోని శశికళ వర్గానికి చెందిన అసమ్మతి నేతల నివాసాల్లో అధికారులు మూకుమ్మడి సోదాలు చేపట్టారు. గురువారం తెల్లవారు జాము నుంచి 80మందికి పైగా ఐటీ అధికారులు ఏకంగా 30 చోట్ల తనిఖీ లు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
Image result for sasikala estate & family

పన్నులు ఎగ్గొట్టినట్టు ఆరోపణలు రావడం వల్లే సోదాలు జరుపుతున్నట్టు ఐటీ అధికారులు పేర్కొన్నారు. "జయ ప్లస్ చానెల్" జాబితా లోని దాదాపు 16 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. చెన్నైలోని ఎక్కతుతంగళ్‌ లోని జయ టీవీ, డాక్టర్ నమధు ఎంజీఆర్ కార్యాలయాలతో పాటు, 'జాజ్ సినిమాస్‌'  కి చెందిన రెండు కార్యాలయాలు కూడా ఇందు లో ఉన్నాయి. 

Image result for ttv dinakaran family

శశికళ కుటుంబం చేతుల్లో ఉన్న మన్నారుగుడి, తంజావూర్‌ లలోని పలువురు నివాసాలపై అధికారులు అకస్మిక సోదాలు నిర్వహించారు. టీటీవీ దినకరన్, దివాకరన్, సుందర వదనం, ఇళవరసి, శశికళ మేనకోడలు కృష్ణప్రియ తదితరులతో పాటు శశికళ కుటుంబంలోని సన్నిహితులందరి ఇళ్లను అధికారులు లక్ష్యంగా చేసుకోవడంతో తమిళనాట ఒక్కసారిగా విస్మయం వ్యక్తమవుతోంది.
Image result for sasikala nearest relatives

జయలలిత ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం జయ టీవీ, డాక్టర్ నమధు ఎంజీఆర్‌ పత్రిక,  శశికళ కుటుంబ సభ్యుల అధీనంలో ఉన్నాయి. శశికళను పార్టీ నుంచి బహిష్క రించి,  "ఈపీఎస్‌-ఓపీఎస్‌" అన్నా డీఎంకే లోని రెండు శిబిరాలు విలీనమైన నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఈ సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి.  పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జయ టీవీ, ఎంజీఆర్‌ పత్రిక పనిచేస్తున్న నేపథ్యం లోనే వీటిపై ఐటీ దాడులు జరగడం రాజకీయంగా సంచలనం రేపుతోంది. 

Image result for namadhu mgr

జయలలిత ఆస్తులన్నీ శశికళ కుటుంబీకుల చేతుల్లోనే ఉండడంతో, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే జయ టీవీ సహా ప్రస్తుతం శశికళ చేతుల్లో ఉన్న అన్ని వ్యాపార సంస్థలపై ఐటీ దాడులు జరగడం గమనార్హం. ఆదాయాన్ని దాచి పెట్టడం, పన్ను ఎగవేయడం వంటి సమాచారం ఆధారంగానే జయ ప్లస్ చానెల్‌ కార్యాలయంలో దాడులు నిర్వహించినట్టు ఐటీ అధికారులు తెలిపారు.
Image result for jaya plus tv logo and office

‘చానెల్‌ పన్ను ఎగ్గొట్టేందుకు ఆదాయ వివరాలను దాచిపెడుతున్నట్టు మాకు సమాచారం అందింది. చానెల్‌ కార్యకలాపాలు, ముఖ్య సిబ్బంది తీరుపై ప్రస్తుతం దృష్టి పెట్టాం’  అని ఐటీ అధికారులు చెప్పారు. జయ చానెల్‌  తో పాటు శశికళ కుటుంబాని కి చెందిన "జాజ్‌ సినిమా థియేటర్‌" పై, వివేక్‌ నివాసం, కొడనాడ్ ఎస్టేట్ లోనూ ఐటీ సోదాలు కొన సాగుతున్నాయి.

Image result for sasikala estate & family

మరింత సమాచారం తెలుసుకోండి: