శాసనసభలో సభాపతిగా ఎంపికై ఆ స్థానంలో కూర్చున్న వ్యక్తికి సభా నిర్వహణలో నిజాయతీ చూపించటమే ఆరో ప్రాణం కావాలి. సభా నిర్వాహకుడుగా ప్రసిద్ధుడైతే ఆ వ్యక్తికి జాతి ఇచ్చే గౌరవం అంతా ఇంత కాదు. చక్కని సభాపతులు ఒకనాటికి పార్లమెంట్లో స్పీకర్ కావచ్చు. ఒకనాటికి ఉపరాష్ట్రపతి లేదా రాష్ట్రపతి కూడా అయ్యే అవ కాశాలు సంకీర్ణప్రభుత్వాలు ఏర్పడితే అలా తన్నుకుంటూవస్థాయి. ప్రతిపక్షాల కూటమి సంకీర్ణంగా ఏర్పడ్డ సమయాల్లో  అలాంటి వ్యక్తుల్ని అలాంటి పదవులకు సహజం గానే ఎన్నుకోవటనికి ప్రయత్నించిన సంధర్బాలు కోకొల్లలు.

Image result for present speaker of ap assembly and his leadership

ప్రతిపక్షం బలహీనంగా, అధికారపక్షాన్ని ఎదుర్కొలేని పక్షంలో - ప్రతిపక్షానికి తమ వేదనను వెలిబుచ్చుకునే చోటు సభాపతి స్థానం. కాని కరుణ, కార్పణ్యాలు మన ఉభయ తెలుగు రాష్ట్రాల సభాపతులలో కలికానికి కూడా కానరావు. వీరు అధికారపక్షానికి కాపుకాసే రక్షకులనే కంటే కూడా వాళ్ళ పాదరక్షలుగా పనిచేస్తున్నారనటంలో సందేహం అక్కరలేదు.


ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన వారు ఇక నిర్బయంగా బతికేయవచ్చు. వారిపై అనర్హత వేటుపడే అవకాశం ఈ అసెంబ్లీ కాల పరిధిలో జరిగే అవకాశం లేదు. అందుకు సభాపతి కోడెల శివప్రసాద రావు చేసిన వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం తనపరిధిలో లేదంటున్నారు సభాపతి కోడెల. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు సుప్రీం కోర్టు విచారణలో ఉందని కాబట్టి తాను ఎలా నిర్ణయం తీసుకుంటానని ప్రశ్నించారు.


రోజా విషయంలో న్యాయస్థానాలు ఇచ్చిన రూలింగ్స్ ను కూడా సభాపతి ఖాతర్ చేయలేదు. అంటే నేటి సభాపతి ఖచ్చితంగా రాజకీయనాయకుడే కాని ఏ మాత్రమూ సభను నిర్వహించగల నాయకుడని అనలేము. అలాంటి సభాపతి ఈ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్ట్ లో ఉందనటం "ఒక సాకు" మాత్రమే తప్ప, సభాపతి ఈ పాపం నుండి తప్పించు కోలేరు.

Image result for ap speaker cm opposition leader in assembly

ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రతిపక్షం అసెంబ్లీని బహిష్కరించిన నేపథ్యంలో, సభాపతి మీడియాతో మాట్లాడారు. ఫిరాయింపుదారులపై నిర్ణయం తీసుకోక ముందే వైసీపీ కోర్టును ఆశ్రయించిందన్నారు. హైకోర్టు కేసు కొట్టివేస్తే ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్లారని, కాబట్టి ఇప్పుడు అనర్హత వేటుపై తానెలా నిర్ణయం తీసుకోగలనని ప్రశ్నించారు.


అయితే వైసీపీ వాదన మరోలా ఉంది. తాము కోర్టుకు వెళ్లిందే ఫిరాయింపుదారులపై చర్యలకు ఆదేశించాలని, ఇప్పుడు స్పీకర్ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకుంటే అందుకు సుప్రీం కోర్టు అభ్యంతరం చెప్పబోదంటున్నారు.


రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి బహిష్కరిస్తే దానిపై ఆమె న్యాయ పోరాటానికి దిగితే, అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టుల జోక్యం తగదంటూ వాదించిన ప్రభుత్వం, ఇప్పుడు మాత్రం ఫిరాయింపుదారులపై అనర్హత వేటువేయాల్సిందిగా కోరితే మాత్రం కేసు కోర్టులో ఉందంటూ సాకు చూపడడం దురదృష్టకరమంటున్నారు. కేవలం ఫిరాయింపుదారులను రక్షించేందుకే కోర్టు అంటూ కొత్త వాదన తెరపైకి తెస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.



ఫిరాయింపుదారులపై చర్య తీసుకోని కారణంగానే విపక్షం న్యాయస్థానం తలుపుతట్టవలసి వచ్చిందిగాని సభాపతే న్యాయం జరిపిస్తే ఆ అవసరం రాదుకదా! అంటున్నారు రాజనీతిఙ్జులు. చివరకిప్పుడు విషయం న్యాయస్థానంలో ఉందని అనటం సిగ్గుమాలినతనం. "అమ్మ పెట్టాపెట్టదు అదుక్కుతినానివ్వదు" అనే సామెత మన సభాపతికి సరిగ్గా వర్తిస్తుంది. న్యాయస్థానా లకు ఈ విషయం లో ఎలాంటి అధికారం లెదన్న తానే నిర్ణయం ఇప్పటికైనా తీసుకోవచ్చు. అంతా సాకు మాత్రమే. 


ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మర్యాద అనేది "నీకు కావాల్సింది ఏమిటి? దానికి నేవేమిస్తావ్" అన్నట్లు ఇచ్చిపుట్టు కోవడం మీదే ఆధారపడి ఉంటుందని అంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో శాసన సభ సభాపతి వ్యవస్థ స్వభావరీత్యా అంపశయ్యపై ఉంది. ఈ సభాపతి తీరుతో సభలో ఆ వ్యవస్థ ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోతోంది. ఏళ్లు గడుస్తున్నా ఫిరాయింపుదారులపై చర్యలు లేక పోవడంతో ప్రతిపక్షం కూడా సభాపతిని గౌరవించలేక పోతుంది.

Related image

ఒక శాసన సభలో అత్యున్నత గౌరవాన్ని పొందవలసిన సభాపతి నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుండి కప్పల తక్కెడలా దూకిన నేతలకు తెలుగుదేశం కండువాలు కప్పిన సందర్భాలేన్నో. అలాంటి కోడెల శివప్రసాదరావు ప్రత్యేక హోదాపై రెండు సార్లు అసెంబ్లీ తీర్మానం చేసినపుడు కూడా వాటిని కేంద్రానికి పంపించలేదని తెలుస్తుంది. 


చంద్రబాబు ఆదేశాలను తు. చ. తప్పకుండా పాటిస్తూ సభాపతి కోడెల శివప్రసాదరావు శాసన సభలో అన్నీపార్టీలను సమ దృష్ఠిలో చూస్తూ సభనిర్వహించాల్సిన చోట ఇలా గోడ దూకటానికి సిద్ధమైన ప్రతిపక్ష సభ్యులను అధికార పక్షంలోకి అతి సునాయాసంగా దూకించే మద్యవర్తిత్వం నిరుపే పని చేస్తున్నారు.


ఎన్నికల్లో గెలుపు కోసం పదకొండు కోట్లరూపాయలు ఖర్చు పెట్టానని స్వయంగా చెప్పిన వ్యక్తి ఒక సభకు నాయకుడుగా ఉండ గా ఆ సభానిర్వహణ ఎలావుంటుందో చెప్పవలసిన అవసరం లేదుకదా! ఆయన స్పీకర్‌గా ఉండడం దురదృష్టకర మన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా "విత్ డ్రాయల్ ఆఫ్ ప్రాసిక్యూషన్" కింద కోడెల శివ ప్రసాద రావు తనపై కేసులను ఎత్తి వేయించుకున్నారని వైసిపి మంగళగిరి ఎమెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి (ఆర్కే) తెలిపారు.

Image result for ap speaker cm opposition leader in assembly

ఫిరాయింపుదారులపై తమ పోరాటానికి న్యాయస్థానం లోనే న్యాయం జరుగుతుందన్న నమ్మ కాన్ని ఆయన వ్యక్తం చేశారు. సభాపతిపై నేరుగా ఆరోపణలు చేస్తోంది ప్రతిపక్షం. అధికార పక్ష సభ్యుడిగా సభలో వ్యవహరిస్తున్న వ్యక్తి సభాపతిగా ఉండడం ఆ సభకే అగౌరవన్ని ఆపాదిస్తుందని అందుకో కొనసాగటం చాలా విచారకరమైన విషయమని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే వ్యాఖ్యా నించారు. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని తాను కోరేందుకు వెళ్తే మ్యాటర్ కోర్టుపరిధిలో ఉందంటూ సభాపతి వ్యాఖ్యానించడంతో తాము తీవ్ర మనస్థాపం చెందామని అన్నారు. అసలు ఆయన నిర్ణయం తీసుకోపోవటమే కథ న్యాయ స్థానానికి చేర్చిందని అన్నారు.

తెలుగుదేశం పాలనలో  తొలి శాసనసభాకాలం మొత్తం అధర్మంగానే అధర్మవర్తనుని నాయకత్వంలో జరిగిందనే చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: