ఒకే ఒరలో రెండు కత్తులు పెట్టడం అనేది అసాధ్యం అని అంటారు పెద్దలు. ఒక థాట్ ప్రాసెస్ లోంచి వచ్చిన ఆలోచన అది, దానికి ఎక్స్ పెరియన్స్ కూడా కలిసి ఉండవచ్చు. అయితే ఒకే ఒరలో రెండు కాదు ఎన్నైనా కత్తులు పెట్టేయగల సామర్ధ్యం ఉన్న నాయకుడు కెసిఆర్. ప్రస్తుతం ఈ మాట ఆయనకే చెల్లి తీరుతుంది.

ఎందుకంటే గడిచిన కొన్ని రోజుల్లో కెసిఆర్ తీరు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మొన్నటి వరకూ కుల ప్రాతిపదికన రాజకీయాలు చేసిన ఆయన ఇప్పుడు మత ప్రాతిపదికన వెళుతున్నారు అంటున్నారు పోలిటికల్ విశ్లేషకులు. తెలుగుదేశంతో పొత్తు ఉంటుంద‌నే సంకేతాలు ఇవ్వ‌డం ద్వారా తెలంగాణ‌లోకి ఒక బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాన్ని త‌న‌వైపు ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేశారు. 

గతం లో ఎవరూ, ఏ ముఖ్యమంత్రీ ఇవ్వనంత సీన్ ని నిజాం పాలన కి ఇస్తున్నారు. ఆంధ్రా పాలకులు ఉన్న టైంలో నిజాం పాలన ఈడ వ్యతిరేక అభిప్రాయం ఉండగా నెమ్మదిగా దాన్ని తొలగించే పని లో కెసిఆర్ నిమగ్నం అయ్యారు. ఈ రకంగా ముస్లిం మైనారిటీ వర్గాలని దగ్గర చేసుకుంటూ వస్తున్నారు. మరొక పక్క క్రైస్తవుల నీ వదలడం లేదు ఆయన.

వ‌క్ఫు బోర్డు మాదిరిగా క్రైస్త‌వుల‌కు కూడా ఓ సంస్థ ఉంటే బాగుంటుంద‌నే ప్ర‌తిపాద‌న తీసుకొచ్చారు. దానికి వచ్చే ఆదాయంతో చ‌ర్చి ఫాద‌ర్ల‌కు, రెవ‌రెండ్ల‌కూ జీతాలు ఇస్తే బాగుంటుంద‌ని అన్నారు. సంద‌ర్భం వ‌చ్చిందిగా.. తెరాస నేత‌లు కూడా స‌భ‌లో ముఖ్య‌మంత్రికి వంత‌పాడారు. ఏకంగా చర్చ్ లో పాస్టర్ లకి గౌరవ వేతనాలు ఇవ్వాలన్నారు కెసిఆర్ సపోర్తర్ లు. అయితే ఇదంతా మత ప్రాతిపదికన కొత్తగా తీసుకొస్తున్న రాజకీయం అనేవారూ లేకపోలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: