కమల్ హాసన్ - రజినీకాంత్ వీరిద్దరి రాజకీయ అరంగేట్రం ఏమో కానీ మీడియా లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వార్తలు పుడుతూనే ఉంటున్నాయి. కానీ ఇప్పటి వరకూ ఎక్కడా ఏ విషయం తేలడం లేదు. రజినీకాంత్ సంగతి అటుంచితే మొన్నటికి మొన్న పుట్టిన రోజు సందర్భంగా కమల్ హాసన్ తన పార్టీ డిటైల్స్ ప్రకటిస్తాడు అన్నారు కానీ అది కూడా ఎక్కడ జరగలేదు.

తమిళ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి ఆయన వామపక్ష పార్టీల్లో చేరేందుకు లేదా ఆ పార్టీలతో చేతులు కలిపేందుకు ఎంతమాత్రమూ సానుకూలంగా లేరు. సొంతంగా పార్టీ పెట్టాలన్నదే ఆయన నిర్ణయం.

మరొక పక్క ఈ సంవత్సరం ఆగస్ట్ లో రజినీకాంత్ రంగ ప్రేవేశం చేస్తారు అని చాలా మంది అనుకున్నారు. కానీ అభిమానులని కలిసి సైలెంట్ అయిపోయారు రజినీ.

మొన్న పుట్టిన రోజు కి కమల్ ఎలాగైతే పార్టీ పెట్టక పోయినా తన రాక కంపల్సరీ ఉంటుంది అనీ ఒక యాప్ కూడా విడుదల చేస్తున్నాను అనీ చెప్పారో కనీసం అంతవరకూ అయినా రజినీకాంత్ రాబోతున్న తన పుట్టిన రోజున అంటే డిసెంబర్ 12 న చెబుతారు అని తెలుస్తోంది. అయితే కొందరు ఆయన సన్నిహితులు మాత్రం పార్టీ పెట్టి తీరతారు అనేవారూ లేకపోలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: