తొలి సారిగా విపక్షం లేని సమావేశాలు ఇవాళ ఉదయం ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో మొదలు అయ్యాయి. సమావేశాల సందర్భంగా ప్రాంగణం అంత కూడా భారీ భద్రత పెట్టడం విశేషం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఎలాంటి నిరసనలు, ప్రదర్శనలు, ఆందోళనలు, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అసెంబ్లీ వైపు వచ్చే అన్ని మార్గాల్లో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. అసెంబ్లీ పరిథి లో 144 సెక్షన్ అమలులో ఉంది. పది కిలోమీటర్ ల పరిధి వరకూ 30 పొలీస్ యాక్ట్ ని అమలు లో పెట్టారు. క్యూ ఆర్తీ బృందాలు కూడా రంగంలోకి దిగిపోయారు.

ప్రజాప్రతినిధుల డ్రైవర్లు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది, అనుచరులను కూడా అసెంబ్లీలోకి అనుమతించడం లేదు. కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముందస్తు అనుమతులు పొందినవారిని మాత్రమే అసెంబ్లీ పరిసరాల్లోకి అనుమతిస్తున్నారు.

మీడియా మొత్తాన్ని నాల్గవ నెంబర్ గేటు దగ్గర మీడియా పాయింట్ దగ్గర రమ్మన్నారు, అక్కడే మీడియా పాయింట్ స్పెషల్ గా ఏర్పాటు చేసారు. ఇంత భద్రత అంత హడావిడి గా ఎందుకు పెట్టారు అనేది అర్ధం అవడం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: