రాజ‌కీయాల్లోకి రావ‌డం తేలికేమో.. కానీ.. ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించ‌డం, ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిపోవ‌డం వంటి ప్ర‌ధాన క‌ర్త‌వ్యాలు అంత వీజీకాదు!  ఇదే విష‌యంలో ప‌వ‌న్ అనేక అంశాలు ఎదుర‌య్యాయ‌ని చెబుతున్నారు.  2014లో రాజ‌కీయంగా సొంత పార్టీ పెట్టుకున్న ప‌వ‌న్‌. అప్ప‌టి ఎన్నిక‌ల్లో పాల్గొన‌కుండా దూరంగా ఉండి టీడీపీకి మ‌ద్ద‌తిచ్చారు. అయితే, ఆ త‌ర్వాత ఆయ‌న పార్టీపై దృష్టి పెడ‌తార‌ని అంద‌రూ భావించారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తిగా దృష్టి పెట్టింది లేదు. ఇక‌, 2019 ఎన్నిక‌లు త‌రుముకొస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ప‌వ‌న్ గ‌ట్టిగా డిసైడ్ అయ్యాడు. తాను అనంత‌పురం నుంచి పోటీ చేస్తాన‌ని కూడా చెబుతున్నాడు. 

Image result for pawan kalyan

అదేవిధంగా ఏపీ, తెలంగాణ‌ల్లో జ‌న‌సేన‌.. ఓ నిర్ణ‌యాత్మ‌క శ‌క్తిగా కూడా మారుతుంద‌ని ప‌వ‌న్ వెల్ల‌డించాడు. అయితే, దీనికి సంబంధించిన గ్రౌండ్ వ‌ర్క్ ఇప్ప‌టి వ‌ర‌కు చేప‌ట్ట‌లేదు. ఇటీవ‌లే.. రాష్ట్రంలోని పార్ల‌మెంటు, అసెంబ్లీ నియోక‌వ‌ర్గాల స్థాయి సంఘాల‌ను ఏర్పాటు చేసే ప‌నిని ప్రారంభించారు. ఇక‌, ప్ర‌జ‌ల మ‌న‌సును దోచుకునేది ఎన్న‌డు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఏదైనా యాత్ర చేస్తే బాగుంటుంద‌ని శ్రేయోభిలాషుల నుంచి సూచ‌న అందింది. కొన్నాళ్లు కొంద‌రు బ‌స్సు యాత్ర అన‌గా.. మ‌రికొంద‌రు పాద‌యాత్ర అని స‌ల‌హాలు ఇచ్చారు. దీంతో పాద‌యాత్ర చేయాల‌ని ప‌వ‌న్ డిసైడ్ అయిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.
Related image
అయితే, ఆ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్‌లో ఎలాంటి అల‌జ‌డి క‌నిపించ‌లేదు. కానీ, జ‌న‌సేన వ‌ర్గం నుంచి వ‌స్తున్న కొన్ని స‌మాచారాల ప్ర‌కారం.. పాద‌యాత్ర‌  విషయంలో ప‌వ‌న్‌కు చాలా సందేహాలు ఉన్నాయి. సుదీర్ఘ కాలాన్ని కేటాయించాల్సి రావటం.. అదే పనిగా రోజుల తరబడి చేయటంతో పాటు.. గ్లామర్ దెబ్బ‌తిన‌డంతో పాటు.. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో పాదయాత్రకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. పాదయాత్ర అన్న వెంటనే ఏదీ.. ఇట్టే జరిగిపోదు. దాని వెనుక చాలా కసరత్తు ఉండాలి. 

Image result for pawan kalyan

రోడ్డు మీదకు వచ్చి ప్ర‌జ‌ల కోసం.. ఒక అధినేత నడుస్తున్నారంటే.. దాని వెనుక వందలాది మంది నిత్యం శ్రమించాల్సి ఉంటుంది. పార్టీకి భారీ బేస్ ఉండాలి. అవన్నీ జనసేనకు లేవన్న మాట వినిపిస్తోంది. అన్నింటికి మించి పాదయాత్రకు అయ్యే ఖర్చు కూడా తక్కువేం కాదు.  ఇంత ఆర్థిక భారాన్ని భ‌రించేస్థాయిలో పవన్ లేరని.. అందుకే పాదయాత్ర విషయంలో ఆయన వెనక్కి తగ్గుతున్నట్లుగా తెలుస్తోంది.

మ‌రోప‌క్క‌, వైసీపీ అధినేత జ‌గ‌న్  పాదయాత్ర చేస్తున్న వేళ.. మరో పార్టీ అధినేత పాదయాత్ర చేయటం జరగదని అంటున్నారు. ఒకవేళ చేద్దామనుకున్నా జగన్ పాదయాత్ర పూర్తి అయ్యాకే సాధ్యం.  అయితే, జ‌గ‌న్ పాద‌యాత్ర క‌నీసం ఆరేడు నెల‌లు ఉంటుంది. అప్ప‌టికి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌స్తే.. ప‌వ‌న్ పాద‌యాత్ర‌.. క‌థ కంచికే అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి ప‌వ‌ర్ స్టార్ ఎలారియాక్ట్ అవుతారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: