రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి బయటకి రావడం అనే విషయం  మీడియా హైప్ కానీ మరేదైనా కానీ హై డ్రామా లెక్కన  నడిచింది. మొదట ఆయన టీడీపీ లీడర్ లని డిల్లీ వెళ్ళొచ్చి టార్గెట్ చెయ్యడం దాని మీద ఏపీ లీడర్ లు కయ్యానికి కాలు దువ్వడం ఇలా నడిచింది కథ మొత్తం. అయితే ఆఖరి ఎపిసోడ్ కి కథ చేరుకునే సరికి టీడీపీ కి బై బై చెప్పేసిన రేవంత్ డిల్లీ వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

అయితే డిల్లీ నుంచి వచ్చిన తర్వాత కేటీఆర్ తో పాటు అనేక మంది రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు కురిపించారు. వాటిల్లో ఒక్కదానికి కూడా రేవంత్ సమాధానం చెప్పలేదు .. సాధారణంగా దేనిమీద అయినా వెంటనే రెస్పాండ్ అయ్యే గుణం ఉన్న రేవంత్ ఈ విషయం లో మాత్రం సైలెంట్ గా ఉండిపోయాడు.

కాంగ్రెస్ లో రేవంత్ కి ఇంకా పదవి ఇవ్వకపోవడమే దీనికి కారణం అంటున్నారు. త్వరలో రేవంత్ కి పెద్ద పదవి అప్పజెప్తారు ఆ తరువాత ఆయన తరీఖా లో ఒక్కొక్కరి మీదా అస్త్రాలు సందిస్తారట.

త్వ‌ర‌లోనే రాహుల్ గాంధీ తెలంగాణ‌కు రాబోతున్నారు. వ‌రంగ‌ల్ లో భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ స‌భ‌లో రేవంత్ కు పార్టీలో ఇచ్చే ప్రాధాన్య‌త‌పై రాహుల్ గాంధీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఈ సభ లో తన హోదా తీసుకునేంత వరకూ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు రేవంత్. 


మరింత సమాచారం తెలుసుకోండి: