శశికళ కుటుంబ సభ్యుల ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్న ఆదాయపన్ను శాఖ అధికారులు ఆమె కుటుంబ సభ్యులకు మరో ఝలక్ ఇవ్వడానికి సిద్దం అయ్యారు. శశికళ కుటుంబ సభ్యుల అందరి ఇళ్లలో సోదాలు చేస్తున్న ఆదాయపన్ను శాఖ అధికారులు శశికళకు ఊహించని షాక్ ఇస్తున్న విషయం తెలిసిందే.  చిన్నమ్మ శశికళ సన్నిహితులు, వ్యాపారవేత్తల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ దాడులు మూడో రోజు కొనసాగుతున్నాయి.
Income Tax raids on Sasikala's kin, business associates enter 3rd day - Sakshi
ఈ సోదాల్లో కొన్ని ఊహించని ప్రాంతాల్లో కూడా విలువైన వస్తువులు, బంగారం గుర్తించినట్టు రిపోర్టులు వస్తున్నాయి.  శశికళ కుటుంబం, బంధువుల పేరిట 10 బోగస్‌ కంపెనీలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు నోట్ల రద్దు సమయంలో బోగస్‌ కంపెనీల ద్వారా భారీగా లావాదేవీలు జరిగినట్లు తనిఖీల్లో వెల్లడైంది. రూ.1000 కోట్లకు పైగా ఆదాయపు పన్ను ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు.
Image result for IT raidssasikala
శశికళ, ఆమె బంధువులకు చెందిన 317 బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేశారు.అక్రమాస్తుల కేసులో శిక్షను అనుభవిస్తున్న శశికళ, ఆమె భర్త నటరాజన్‌, సోదరుడు దినకరన్‌, మేనల్లుడు దినకరన్‌లతో పాటు సన్నిహితులు, వారి సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది, జ్యోతిష్కుడు, వైద్యుడు, ఆడిటర్‌ ఇలా ఎవ్వరినీ వదలకుండా ఇళ్లలో, కార్యాలయాల్లో మూడు రోజుల నుంచి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: