భూమిపై ఆకలి పోరాటం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..ఒక జీవిని చంపి మరో జీవి తన కడుపు నింపుకుంటుంది. అది ప్రకృతి ధర్మం..అయితే ఆ పోరాటంలో తనపై దాడి చేసిన శత్రువు నుంచి తప్పించుకోవడానికి కొన్ని జీవులు పడే కష్టం అంతా ఇంతా కాదు.  తాజాగా కొండచిలువ , గబ్బిలం మధ్య జరిగిన కొట్లాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
Image result for కొండచిలువతో గబ్బిలం
నెల మీద జీవులను పట్టుకుని మింగేసే కొండచిలువకు చేట్లపై తలకిందులుగా వేలాడే గబ్బిలం ఎలా దొరికిందనేది ఆసక్తి రేకిస్తోంది. చెట్టు కొమ్మకు వ్రేలాడుతున్న గబ్బిలాన్ని అమాంతం పట్టుకొని చుట్టేసింది. తాజాగా ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో చోటుచేసుకున్న ఓ ఘటనలో గబ్బిలం మాత్రం కొండచిలువ చెర నుంచి బయటపడగలిగింది.

గబ్బిలాన్ని మింగడానికి ప్రయత్నిస్తున్న  కొండచిలువను ఒదిలించుకునేందుకు  గబ్బిలం హోరాహోరీగా పోరాడింది.  దాదాపు అరగంట పాటుగా జరిగిన పోరులో చివరికి విజయం గబ్బిలాన్ని వరించింది. ఆకలి మీద ఉన్న కొండ చిలువ గబ్బిలంతో పోరాడలేక విడిచి పెట్టింది.  ఈ ఘటనను వీడియా  టోనీ మారిసన్ అనే వ్యక్తి వీడియో తీసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది కాస్తా వైరల్ అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: