పాకిస్తాన్ ని ఒకప్పుడు పాలించిన మాజీ నియంతగా పేరు ఉన్న పర్వేజ్ ముషరాఫ్ తాజాగా 23 పార్టీ లతో కలిసి మహా కూటమి ని ఏర్పాటు చేసారు. రాబోయే సంవత్సరం లో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలని టార్గెట్ చేస్తున్న ఆయన మహాకూటమి గెలుపు కోసమే పోరాడతాం అని చెప్పారు.


మాజీ ప్రధాని పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్)ను ఎదుర్కోవడమే లక్ష్యంగా మహాకూటమి పురుడు పోసుకుంది. పాకిస్థాన్ అవామీ ఇత్తెహాద్ (పీఏఐ) పేరుతో వస్తున్న ఈ కూటమికి 75  ఏళ్ల ముషారఫ్ సారథ్యం వహించనున్నారు. ఈ కూటమికి ఇక్బాల్ దార్ సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు.



ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు ముషారఫ్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ అన్ని పార్టీలూ ఈ కూటమి లో చేరాలి అనీ పెద్ద పార్టీలు అయిన ముత్తాహితా క్వామి మూమెంట్ (ఎంక్యూఎం), పాక్ సర్జామీన్ పార్టీ (పీఎస్‌పీ)లను తమతో చేతులు కలపాల్సిందిగా కోరారు.



పాకిస్తాన్ లో ప్రధాన , బలమైన ప్రతిపక్షం గా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఉంది. ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఐ-ఇన్సాఫ్ (పీటీఐ)ని కూడా తమతో కలిసి రమ్మని ఆహ్వానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: