ఈ నెల ముప్పై నా కొలువుల కొట్లాట సభ కి జేఏసీ చైర్మన్ కోదండరాం రెడీ అవుతున్నారు. ఈ సభ నిర్వహణ కి పోలీసు అనుమతి లేకుండా తెరాస పార్టీ అడ్డం పడుతుంది అని అనుకుంటున్నారు కూడా. అయితే గత ఏడాది పైన కాలం నుంచీ కోదండరాం చాపకింద నీరు లాగా తన పనులు తాను సైలెంట్ గా చేసుకుంటూ పోతున్నారు. ' అమరవీరుల స్ఫూర్తి యాత్ర ' పేరుతో ఆయన చేస్తున్న యాత్ర నెమ్మదిగా సూపర్ హిట్ అయింది.

జనాలలో కలవడం మింగిల్ అవడం వారి సమస్యలు తెలుసుకోవడంలో కోదండరాం ఫుల్ సక్సెస్ఫుల్ అయ్యారు. మొదట్లో తెరాస ఈ యాత్ర న్ని లైట్ తీసుకుంది కానీ రాను రానూ కాస్త సీరియస్ గా తీసుకోవడం మొదలు పెట్టింది.

తాజాగా జేఏసీ రాజకీయ పార్టీ అవుతుందా లేదా అనేది కోదండరాం జనవరి లో చెబుతా అనడం కూడా రాజకీయాల్లో చర్చ కి తెర ఎత్తినట్టు అయ్యింది.జేయేసీ పార్టీగా మారితే కొన్ని స‌వాళ్ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

కాంగ్రెస్ vs తెరాస గా రానున్న ఎలక్షన్ నడిచే అవకాశం కనిపిస్తోంది ఈ టైం లో టీడీపీ - బీజేపీ కంటే తక్కువ ఛాన్స్ జేఏసీ కి ఉంది. అన్నిటికంటే ఎక్కువగా మీడియా సపోర్ట్ కెసిఆర్ వైపే కనపడుతోంది. అభిమానమో భయమో కెసిఆర్ ని ఇప్పటి వరకూ తెలంగాణా లో ఎదిరించిన ఛానల్  కానరాలేదు. సో దీన్ని  జేయేసి ఎలా ఎదురుకొంటుంది అనేది ఆసక్తికరం.


మరింత సమాచారం తెలుసుకోండి: