గ్రామీణ తెలంగాణాలో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే కెసిఆర్ నిజాం పాలనను విపరీతంగా పొగిడేశారు అదీ శాసనసభలో. జనానికి నిజాం పాలనలో జరిగిన కిరాతక కృత్యాలు, క్రౌర్య స్వభావం, దూర్త నీతి జనానికి గుర్తొచ్చి వాళ్ళ మనో ఫలకంపై సినిమాలాగా కనిపించి వారి ఒళ్ళు జలదరించిందట. వాళ్ళకి మనోనేత్రం పై ఈ క్రింది గేయం కదలాడింది. అలాంటి నిజాం ని కెసిఆర్ పోగడటం జన హృదయాల్లో నిప్పురాజెసింది.......    


|| బండెనుక బండి గట్టి, పదహారు బండ్లు గట్టి, ఏ బండ్లే వస్తవ్ కొడుకో.. నైజాము సర్కరోడా... నాజీల మించినవురో నైజాము సర్కరోడా బండెనుక బండి గట్టి, పదహారు బండ్లు గట్టి, ఏ బండ్లే వస్తవ్ కొడుకో.. నైజాము సర్కరోడా... నాజీల మించినవురో నైజాము సర్కరోడా ||


పోలీసు మిల్ట్రీ రెండూ... పోలీసు మిల్ట్రీ రెండూ || బలవంతులానుకోని... బలవంతులానుకోని... || నీవు పల్లెలు దోస్తివి కొడుకో ... నీవు పల్లెలు దోస్తివి కొడుకో || హా పల్లెలు దోస్తివి కొడుకో.. నైజాము సర్కరోడా || బండెనుక బండి గట్టి, పదహారు బండ్లు గట్టి, ఏ బండ్లే వస్తవ్ కొడుకో.. నైజాము సర్కరోడా... నాజీల మించినవురో నైజాము సర్కరోడా ||


జాగీరు దారులంతా ... జాగీరు దారులంతా || జామీను దారులంతా ... జామీను దారులంతా || నీ అండా జేరిరి కొడుకో ... నీ అండా జేరిరి కొడుకో || నీ అండా జేరిరి కొడుకో ... నైజాము సర్కరోడా || బండెనుక బండి గట్టి, పదహారు బండ్లు గట్టి, ఏ బండ్లే వస్తవ్ కొడుకో.. నైజాము సర్కరోడా... నాజీల మించినవురో నైజాము సర్కరోడా ||


స్త్రీ పురుషులంత గలిసి ... ఇల్లాలమంత గలిసి || స్త్రీ పురుషులంత గలిసి ... ఇల్లాలమంత గలిసి || వడిసేల రాళ్లు నింపి, వడి వడి గ గొట్టితేను ... వడిసేల రాళ్లు నింపి, వడి వడి గ గొట్టితేను || కారాపు నీళ్లు దెచ్చి , కండ్లల్ల జల్లితేను... కారాపు నీళ్లు దెచ్చి , కండ్లల్ల జల్లితేను || నీ మిల్ట్రీ బారిపోయెరో... నీ మిల్ట్రీ బారిపోయెరో || నీ మిల్ట్రీ బారిపోయెరో... నైజాము సర్కరోడా || బండెనుక బండి గట్టి, పదహారు బండ్లు గట్టి, ఏ బండ్లే వస్తవ్ కొడుకో.. నైజాము సర్కరోడా... నాజీల మించినవురో నైజాము సర్కరోడా ||


సుట్టు ముట్టు సూర్యపేట... నట్టనడుమ నల్లగొండ || సుట్టు ముట్టు సూర్యపేట... నట్టనడుమ నల్లగొండ || నీవు ఉండేది హైద్రబాదూ ... దాని పక్కా గోలుకొండా || నీవు ఉండేది హైద్రబాదూ ... దాని పక్కా గోలుకొండా || గోలుకొండా ఖిల్లా కింద, గోలుకొండా ఖిల్లా కింద || నీ ఘోరీ కడ్తమ్ కొడుకో... నైజాము సర్కరోడా || నీ ఘోరీ కడ్తమ్ కొడుకో... నైజాము సర్కరోడా || నీ ఘోరీ కడ్తమ్ కొడుకో... నైజాము సర్కరోడా || నీ ఘోరీ కడ్తమ్ కొడుకో... నైజాము సర్కరోడా || నీ ఘోరీ కడ్తమ్ కొడుకో... నైజాము సర్కరోడా || నీ ఘోరీ కడ్తమ్ కొడుకో... నైజాము సర్కరోడా ||


నాటి గేయం నిజాం పాలనను ఎదిరిస్తూ జనం గొంతు నుంచి ప్రవహించిన విప్లవ ప్రవాహం.  అలాంటి నిజాం ను కెసిఆర్ ఇలా పొగడటం ఆయన చరిత్ర రాయించట మంటే తెలంగాణా ప్రజల హృదయాల్లో మంట రెకెత్తించటమే. 


తెలంగాణ రాష్ట్రంలో నిజాంను మరిపించేలా కేసిఆర్ పాలన చేస్తున్నాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. సామాజిక తెలంగాణ సమగ్ర అభివృద్దికై సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన పోరు బాట యాత్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలో కొనసాగింది. ఈ సందర్బంగా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రజలను ఉద్దేశించి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సామాజిక తెలంగాణ,సామాజిక న్యాయం,సమగ్ర అభివృద్ధికి మారుపేరు తెలంగాణ రాష్ట్రమని ఎస్సీ, ఎస్టీ, బీసి మైనార్టీ వర్గాలకు అన్ని రంగాల్లో సమన్యాయంగా అందించాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా సిపిఐ పోరుబాట మొదలుపెట్టిందని తెలిపారు. 

Image result for cpi chada venkata reddy

బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను వంచించే విదంగా కుట్రలు చేస్తున్న కెసిఆర్‌కు గుణపాఠం తప్పదని తెలంగాణలోని పాలకులను నిలదీయడానికే సిపిఐ పోరు బాట పట్టి ప్రజల మద్దతు కూడగట్టుకుంటుందని చాడ వెంకటరెడ్డి తెలిపారు. ప్రజల కోసం చాడ చేస్తున్న పోరుబాటకు కాంగ్రెస్ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మండల అద్యక్షులు పోల్నేని రాజేశ్వర్‌రావు సంఘీభావం తెలిపారు.

chada

ఈ కార్యక్రమంలో వరంగల్, జయశంకర్ జిల్లాల కార్యదర్శులు తక్కళ్ళపల్లి శ్రీనివాస్‌రావు, కొరిమి రాజ్‌కుమార్, రాష్ట్ర, మరియు జిల్లా నాయకులు వెంకటరాముడు, సృజన, పద్మ, యూసిప్, రంగాచారి, రాములు, అంజయ్య, లక్ష్మీ నారాయణ, శ్రావణి, జ్యోతి, రాజయ్య, మల్లికార్జునరావు పాల్గొన్నారు. 


నిజాం చరిత్ర తిరగ రాయడానికి పూనుకుంటే ప్రజలు కెసిఆర్ చరిత్రను తిరగరాస్తారని, నిజాంకు పట్టిన గతే కెసిఆర్‌ కు పడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి హెచ్చరించారు. నిజాం రాజు చరిత్రను రాయిస్తానని సిఎం కెసిఆర్ ప్రకటించడం తానూ నిజాం నమూనా పాలన సాగించనున్నట్లు అర్థమవుతోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజాం తన రాజ్యంలో ప్రజలందరితో వెట్టి చాకిరి చేయించారని, పౌర హక్కులను లేకుండా చేశాడని, అలాంటి పాలనను కెసిఆర్ రప్పించాలని నుకుంటు న్నారా?  అని ప్రశ్నించారు. 


విశ్వ విద్యాలయాలు, ఆసుపత్రులు, ప్రాజెక్టులు కట్టించినంత మాత్రాన మంచి పాలకులు కాదన్నారు. బ్రిటీషు పాలకులు కూడా రైల్వే-లైన్‌ లు, ఉన్నత విద్యాలయాలు, ఆసుపత్రులు కట్టించారని, అందుకని వారి పాలన ను కీర్తిస్తామా?  అని ప్రశ్నించారు. ఆనాడు గ్రామాల్లో జరిగిన దోపిడీ, వెట్టి చాకిరి, అణిచివేతకు నాటి నిజాం పాలకులే బాధ్యులని ఆయన అన్నారు.

Image result for telangana people sufferings in nizam rule

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం దాపురించిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి యూటీఎఫ్‌ జిల్లా సదస్సులో ఆయన మాట్లాడుతూ అన్నారు. సామాన్య పౌరులకు అందుబాటులో లేని ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ రికార్డు సాధించాడని విమర్శంచారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో బహుళ అంతస్తుల భవనం నిర్మించుకుని అందులోనే ఉంటూ నియంతృత్వ పాలన సాగిస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు.

uttam kumar reddy about kcr కోసం చిత్ర ఫలితం

ప్రజలకే కాక మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా కనీసం అపాయింట్‌మెంట్‌ ఇచ్చే పరిస్థితిలో సీఎం లేడని ఎద్దేవా చేశారు. ఉపాధ్యయులు వారి సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై కూడా చైతన్యం చేసి పోరాటాలను సాగించాలని  ఉత్తమ్‌ సూచించారు.

ఇదే నిజమైతే ఇప్పటికే దొర కెసిఆర్ నిజాం ను మరిపించటం మొదలెట్టారని అంటున్నారు తెలంగాణా వాసులు 

మరింత సమాచారం తెలుసుకోండి: