ఏపీకి ప్రత్యేక హోదా, కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు, ప్రత్యేక రైల్వే  జోన్,  పోలవరం ప్రాజెక్ట్ ఇలా అన్నిటికోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటూ చంద్రబాబు కేంద్రంతో అంటకాగారు మొన్నటివరకు. అయితే కేంద్రం మాత్రం ఏపీ ఏ విషయంలోనూ పేచీ  పడకపోవడంతో కేంద్రం కూడా ఏపీకి చాలా అన్యాయం చేసుకుంటూ వ‌స్తోంది. ఇదంతా తెలిసినా సీఎం చంద్రబాబు మాత్రం నోరు మెదపలేకపోతున్నాడు. దానికి చంద్ర‌బాబు చెపుతోన్న కార‌ణం కూడా వింత‌గా ఉంది. కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే ఏపీకి ప్రయోజనం, కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకుంటే మనకు వచ్చే ప్రయోజనం ఏం ఉండదు అంటూ ప్రతిపక్షాలను, చంద్రబాబుని  ప్రశ్నించిన వారికీ ఆయన ఇస్తున్న  సమాధానం. 

polavaram project కోసం చిత్ర ఫలితం

వాస్త‌వంగా చూస్తే కేంద్రంతో సఖ్యతగా ఉంటే ఏపీకి ఇప్ప‌టి వ‌రకు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేదు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా కేంద్రం భాషలో హోదా వేస్ట్…ప్యాకేజీ బెస్ట్ అని చెప్తూ వచ్చారు. అప్పటికి ఆ అవసరం గడిచిపోయింది. ఈ మధ్యే ప్యాకేజీ కింద రావాల్సిన నిధులు కూడా రావటంలేదని సాక్ష్యాత్తూ చంద్రబాబే విలేకరుల సమావేశంలోనే వాపోయారు. పోనీ హోదా..ప్యాకేజీని పక్కన పెడితే ఇంకా ఏమైనా అదనపు రాయితీలు..ప్రయోజనాలు అందుతున్నాయా ? అంటే అదీ లేదు. 


పోలవరం విషయంలోనూ కేంద్రం పెట్టే మెలికలు అన్నీ ఇన్నీ కావు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వ స్వీయ తప్పిదాలు కూడా ఉన్నాయనుకోండి. అసలు జాతీయ ప్రాజెక్టు అని ప్రకటిస్తే ఎంత ఖర్చు అయితే అంత కేంద్రమే భరించాలి. కానీ కేంద్రం 2014 రేట్ల ప్రకారమే మేం ఇస్తామంటే చంద్రబాబు కూడా  దానికి అంగీకారం తెలప‌డం చూస్తే బాబు ఎంత డిఫెన్స్‌లో ఉన్నారో అర్థ‌మ‌వుతోంది. అయినా కేంద్రం ప్రాజెక్టు విష‌యంలో ఎప్పుడూ ఏదో ఒక కొర్రీ పెడుతూనే ఉంటోంది. ఎందుకంటే పనులు చేసే బాధ్యత తమకు అప్పగించింది కాబట్టి..అందులో ఆయనకు ప్రయోజనం ఉంది కాబట్టి. లేకపోతే కేంద్రం చేయాల్సిన పనిని అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎలా చేపడుతుంది అన్నదే ఓ పెద్ద ప్రశ్న. ఇది ఇప్పట్లో తెమిలేలా? లేదు.

visaka railway jone కోసం చిత్ర ఫలితం

మరి చంద్రబాబు కేంద్రంతో అంత సఖ్యతగా ఉండి పొందిన అదనపు  ప్రయోజనం ఏమిటి?.  అదనపు సంగతి పక్కన పెడితే రావాల్సిన ప్రయోజనాలు కూడా రావటం లేదు. అయినా  చంద్రబాబు గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు. రాష్ట్ర విభజన సమయంలో చెప్పినట్లు విశాఖకు రైల్వే జోన్ ఇచ్చారా ?. విభజన చట్టంలో ఉన్న అసెంబ్లీ  సీట్లు పెంచారా?. రాజధాని నిర్మాణానికి ఏమైనా అదనపు నిధులు కేటాయించారా ? అంటే ఏమీలేదు. ప్రధాని నరేంద్రమోడీ గత కొంత కాలంగా చంద్రబాబునాయుడికి  కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వటం లేదు. మోడీకి ఏపీ లో  చంద్రబాబు అవసరం అయిపోయిందేమో అన్నట్లు ప్రతి  ఒక్కరిలోనూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరి స్వార్ధం కోసం వారు చూసుకున్నా ఇక్కడ అన్నిరకాలుగా దెబ్బతింటున్నది మాత్రం ఏపీ ప్రజలే. 


మరింత సమాచారం తెలుసుకోండి: