Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Nov 20, 2017 | Last Updated 5:54 am IST

Menu &Sections

Search

అఖిల ప్రియ రాజకీయంగా సకల ప్రియ అయిపోయిందే: పవిత్ర సంగమం వద్ద బోటు ప్రమాధం చెప్పిన నిజం

అఖిల ప్రియ రాజకీయంగా సకల ప్రియ అయిపోయిందే: పవిత్ర సంగమం వద్ద బోటు ప్రమాధం చెప్పిన నిజం
అఖిల ప్రియ రాజకీయంగా సకల ప్రియ అయిపోయిందే: పవిత్ర సంగమం వద్ద బోటు ప్రమాధం చెప్పిన నిజం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సర్వఅనర్ధాలకు మూలం రాజకీయాధికారం. మీరేవిషాధమైనా పరిశీలించండి మన రాష్ట్రంలో, దాని వెనకనుండి నడిపించేది  మంత్రి లేదా లోకల్ ప్రజాప్రతినిధులు మాతమే నన్నది జగమెరిగిన సత్యం. విషాధం తరవాత ముఖ్యమంత్రి అక్కడికి వచ్చి ఒక విషాధగీతం ఆలపించి అధికారులను దుయ్యబట్టి మరణించిన వారి కుటుంబాల కు సంతాపం తెలిపి ప్రకటించి దానిపై ఒక విచారణ కమిటీ వేసి క్రమంగా కేసును నిర్వీర్యం చేస్తారు. అసలు ది ప్రజలు బలిసేది నాయకులు అధికారులు ఇచ్చేది ఎక్సుగ్రేషియా అదీ ప్రజల సొమ్మే.  సొమ్ము దండుకునేది ప్రజానాయకులు మంత్రులు. బాగుపడేది అధికారములో ఉన్న నాయకులే. తాజా కథేమంటే:

krishna-pavitra-sangamam-botu-pramadham-devineni-a

కృష్ణానదిలో పవిత్రసంగమం ప్రాంతానికి చేరువలో పడవ బోల్తాపడిన సన్ఘటనలో 21మంది దుర్మరణం చెందటంవెనక రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యం దాగుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణానది సాక్షిగా  "ప్రైవేట్‌ బోటింగ్‌ మాఫియా" మూడేళ్లుగా సొమ్ముచేసుకుంటూ తమ ఇష్టారాజ్యంగా కొనసాగేందుకు ప్రభుత్వ పెద్దలస్థాయి నుంచే నిర్వాహకులకు సహకారం అందుతున్నట్లు తెలుస్తుంది. బోటింగ్‌ ఈ దందా వెనుక కృష్ణా, గుంటూరుజిల్లాలకు చెందిన ఇద్దరుమంత్రులు ఉన్నట్లు తెలిసినా నోరు మెదపలేని దుస్థితి అధికార యంత్రాంగానిది. 


తమ అవినీతి, వైఫల్యాలను కప్పిపుచ్చి ప్రమాద తీవ్రతను తగ్గించి చూపేందుకు ప్రభుత్వం "సామాజిక మాధ్యమాల వేదిక" గా అసత్య ప్రచారానికి తెరతీసింది. ఏకంగా పర్యాటకులదే తప్పు అనే రీతిలో అనైతిక ప్రచారానికి దిగజారుతోంది. పున్నమి ఘాట్‌ వద్ద అధికారులు వద్దని చెబుతున్నా పర్యాటకులు వినిపించుకోకుండా బోటు ఎక్కారంటూ మంత్రి అఖిలప్రియ పేర్కొనడం గమనార్హం.


కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ మంత్రుల "బినామీ" లే బోటింగ్‌ మాఫియాను శాసిస్తున్నారు. జనం ప్రాణాలతో చెలగాటమాడుతూ కోట్లు ఆర్జిస్తున్నారు. నిబంధనల ప్రకారం బోట్లకు జలవనరులు, రెవెన్యూ, అగ్ని మాపకశాఖల నుంచి అనుమతి ఉండాలి. బోటు పరిమాణం, డిజైన్‌ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో జలవనరుల శాఖ  చూడాలి. నదిలో రూట్‌మ్యాప్‌ సర్వే చేయాలి. వాటిపై సంతృప్తి చెందితేనే "నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌" ఇస్తుంది. ఇక జలక్రీడలు, సాహసక్రీడలకు అనుమతించాలంటే మరిన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అగ్ని మాపక పరికరాలు సరిగా ఉన్నాయో? లేదో? చూడాలి. సీసీ కెమెరాలు, ప్రయాణికుల భద్రత ఎలా ఉందన్నది రెవెన్యూ శాఖ చూడాలి.

krishna-pavitra-sangamam-botu-pramadham-devineni-a

లైఫ్‌ జాకెట్లు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పరిశీలించి ఆ మూడు శాఖలు అనుమతిస్తేనే పర్యాటక శాఖ లైసెన్సు ఇవ్వాలి. కానీ అవేమీ లేకుండానే బోట్లను నదిలో తిప్పుతున్నా పర్యాటకశాఖ అభ్యంతరం చెప్పలేదు. కృష్ణా నదిలో చిన్నా పెద్దా కలిపి దాదాపు 300బోట్లు ఉన్నాయి. వాటిలో 90శాతానికిపైగా బోట్లకు ఎలాంటి అనుమతి లేదు. నదీజలాల్లో సాహసక్రీడలను కూడా నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇద్దరు మంత్రులకు  బినామీలు కావడంతో అక్రమ బోటింగ్‌ కార్యకలాపాలపైగాని, దాని ఆపరేటర్లపైగా కించిత్తు పర్యవేక్షణ కూడా లేకుండా చూస్తూ అధికారులు ఉదాసీనంగా ఉండిపోయారు. 


అక్రమ బోటింగ్‌ కార్యకలాపాలకు జలవనరులశాఖదే ప్రధాన బాధ్యత. విజిలెన్స్‌ శాఖ సీజ్‌ చేసి అప్పగించిన బోట్లను జలవనరులశాఖ విడిచిపెట్టేసింది. కృష్ణానదిలో అనుమతి లేని బోట్లు తిరుగుతున్నా ఏనాడు పట్టించుకోలేదు. బోటు ఆపరేటర్లు మంత్రి దేవినేని ఉమాకు సన్నిహితులు కావడంతోనే చూసీచూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్యాటక శాఖలో కొందరు అధికారులు కూడా ఈ బోటింగ్‌ మాఫియాలో భాగస్వాములుగా ఉన్నారని స్పష్టమవుతోంది. 2014 నుంచి చాలా రోజుల పాటు పర్యాటకశాఖను స్వయంగా ముఖ్యమంత్రే  దాదాపు మూడేళ్ల పాటు పర్యవేక్షించటం గమనార్హం.

krishna-pavitra-sangamam-botu-pramadham-devineni-a

పడవ ప్రమాదం వెనుక తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్రమాదం జరిగి 24గంటలు గడిచినప్పటికీ బోటు ఆపరేటర్లను అరెస్టు చేయలేదు. తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి సరిపుచ్చుతోంది. బోటు నడుపుతున్న సరంగు ఏమయ్యాడనే విషయంలోగాని వేరే కోణంలో ఇంతవరకు పోలీసులు దర్యాప్తు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. అతడు ఉద్దేశపూర్వకంగానే పరారయ్యేలా సహకరించారని స్పష్టమవుతోంది. గతంలో లారీ డ్రైవర్‌గా ఉన్న అతడిని బోటు డ్రైవర్‌గా నియమించారని తెలుస్తోంది. 

krishna-pavitra-sangamam-botu-pramadham-devineni-a

ప్రమాదానికి గురైన బోటును అధికారులు ఆదివారం ఉదయం దుర్గా ఘాట్‌లో అడ్డుకున్నారంటూ ప్రభుత్వం ఓ వీడియోను ప్రచారంలోకి తెచ్చింది. పర్యాటకశాఖ మంత్రి అఖిల ప్రియ స్వయంగా ఆ విషయాన్ని ప్రస్తావించారు. "అనుమతిలేని బోటు ను ఆదివారం ఉదయం దుర్గాఘాట్‌కు ఆపరేటర్‌ తీసుకువస్తే మా అధికారులు అడ్డుకున్నారు. కానీ ఆపరేటర్‌ వారికి  తెలియ కుండా సాయంత్రం పున్నమి ఘాట్‌కు తీసుకువచ్చి పర్యాటకులను ఎక్కించుకున్నారు. దాంతోనే ప్రమాదం జరిగింది. పున్నమి ఘాట్‌ వద్ద అధికారులు వద్దని చెబుతున్నా పర్యాటకులు వినిపించుకోకుండా బోటు ఎక్కారు" అని అఖిల ప్రియ పేర్కొన్నారు.

అనంతరం పర్యాటకశాఖ సీసీ టీవీలో రికార్డు అయిన వీడియోను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారంలోకి తెచ్చింది. అయితే అది ఎప్పటిదో పాత వీడియో అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇద్దరు ప్రయాణించే ఓ స్పీడ్‌ బోటును ఓ అధికారి జట్టీ వద్ద తాడుతో కడుతున్నట్లుగా ఉంది. అసలు అనుమతి లేని పడవ ప్రయాణికులతో తిరుగుతుంటే దుర్గాఘాట్‌ వద్దే సీజ్‌ చేయకుండా పున్నమిఘాట్‌ వరకు ఎందుకు రానిచ్చారన్న ప్రశ్నకు జవాబు లేదు.

krishna-pavitra-sangamam-botu-pramadham-devineni-a

krishna-pavitra-sangamam-botu-pramadham-devineni-a
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పెరిగిపోతున్న ప్రజాధరణతో నరెంద్ర మోదీ: ‘ప్యూ’ సర్వే
వీటి బావమేమి తిరుమలేశా! సారీ!  ప్రభాస్ & స్వీటీ!
భారత పరపతి మన్మోహన్ కన్నా మోడీనే బాగా పెంచారు: ఫేస్-బుక్ పోల్
పరువు పోగొట్టుకున్న కేరళ కామ్రేడ్‌లు
ఎడిటోరియల్: ఏబిఎన్ సంస్థ టిడిపి బాజాగా మారటం మీడియాధర్మాన్ని తాకట్టు పెట్టడమే
ఎడిటోరియల్: రుద్రమదెవి మన చరిత్ర - గుణశేఖర్ వేదనకు అర్ధముంది
నంది అవార్డులా అవికావు .... నారా అవార్డులు: రోజా ది ఫైర్ బ్రాండ్
పురుషులు ఎలా ఉండాలి?
 కెసిఆర్ చరిత్ర తిరగ రాయటానికి తెలంగాణా ప్రజలు సిద్దమౌతున్నారు!
వావ్! నంది అవార్డ్స్ కమిటి మెంబర్లూ! మీకు పాదాభి వందనం: రామ్‌గోపాల్‌ వర్మ
దీపికా పదుకొనే ముక్కు కోసేస్తాం!
ప్రకాష్ రాజ్ చెప్పిందొకటి - న్యూస్ రిపోర్టర్స్ రాసిందొకటి
లండన్ లో పవన్ కళ్యాణ్ కు  ‘గ్లోబల్ ఎక్సలెన్సీ అవార్డు’
చిరంజీవి సినీ-కారీర్ లో ఇలా చేయటం షాకింగ్, కానీ ఇదే మొదటి సారి!
చైనాకి ధారుణమైన ఎదురుదెబ్బ ఆసియా పసిపిక్ కు భారత్ నాయకత్వంలో చతుర్భుజ కూటమి
భారత్ ను తిడుతూ పాకిస్థాన్ ను పొగుడుతూ ఫరూక్ అబ్దుల్లా వికృతమైన వ్యాఖ్యలు
ప్రభాస్ కు నంది అవార్డ్ ను మించిన అంతర్జాతీయ గౌరవం...హాట్స్ ఆఫ్ ప్రభాస్
నంది అవార్డులు రుద్రమదేవికి ఇవ్వకపోవటం జాతి దురదృష్టం - అందుకే మనం సిగ్గుపడదాం!
మేక్ ఇన్ ఇండియా - కుప్పలు తెప్పలుగా ఉద్యోగ స్వయం ఉపాది అవకాశాలు మరి నిరుద్యోగం?
ఉగ్రవాదానికి ఆజ్యం పోసే చైనా ని నిలువరించాలి: మోడీ తో ఆసియాన్
ఇండో -పసిపిక్ ప్రాంతంలో భారత్ మాత్రమే పెద్దన్న: అమెరికా
సోవియట్ లాగే చైనా కూడా ముక్కలై కుప్ప కూలిపోనుందా?
నంది అవార్డ్ కమిటీ బాటిల్లో టిడిపి వైన్ - అంతా కుల బందు ప్రీతి కంపు
ఏడిటోరియల్: భారత్ పట్ల చైనా వ్యతిరేఖత ఇంతగా పెల్లుబకటానికి బలమైన కారణం?
శశికళ మాత్రమే కాదు! గుర్మీత్ సింగ్ కూడా జైలు అధికారులకు ప్రత్యేకమే!
హార్ఢిక్ పటేల్.....వీడు కూడ ఇంతే? సిగ్గూ నియమం మానం పాటించే యువనేత దొరకడా?
అఖిల ప్రియ రాజకీయంగా సకల ప్రియ అయిపోయిందే: పవిత్ర సంగమం వద్ద బోటు ప్రమాధం చెప్పిన నిజం
పాకిస్థాన్ గుండెల్లో పరుగెడుతున్న బుల్లెట్ రైళ్ళు "బలూచ్ స్వతంత్ర ఉద్యమం"
About the author