రాజ‌కీయాల్లో శాశ్వత శ‌త్రువులు కానీ  మిత్రులు కానీ  ఉండ‌ర‌నీ మరొకసారి తెలంగాణా రాజకీయాలలో రుజువు అవుతుందనవచ్చు. విషయానికి వస్తే తెలంగాణలో తెలుగు దేశం పార్టీ పరిస్థితి మూలిగే నక్క మిద తాటికయ లాగా ఉంది. తెలంగాణా లో తెలుగు దేశం పార్టీ చచ్చి పోయింది అని ఒక్కరు, లేదు అని మరొకరు అంటున్నారు. ఇటువంటి సందర్భంలో పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి పార్టీని విడటం టిడిపికి తీవ్రనష్టం జరిగిందని ఒక్కరు, వెళ్ళినా పార్టీకి  వచ్చే ఇబ్భంద్ది ఏమి లేదని మరొకరు ఒకలా స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా టిడిపి తెరాస తో వచ్చే ఎన్నికల లో పొత్తు ఉంటుందని ఒక నాయకుడు ప్రకటిస్తుంటే, ఎన్నికల వరకు ఎటువంటి పొత్తులు ఉండవని టిడిపి కి క్లారిటీ ఉంది అని మరొకరు. పొత్తుల మీద ఇరు  పార్టీల నాయకులూ ఒక్కొక్క‌రు ఒక్క‌లా స్పందిస్తున్నారు.
ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ తో టిడిపి పొత్తు కోసం ఒకప్పటి  టిడిపి నాయకుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ ప్రతిపాదనను తీసుకొని వచ్చిన రేవంత్ మీద అ పార్టీ సంబంధించిన నాయకుడైన మెత్కుపాలి నరసింహులు ఈ పొత్తు ని తీవ్రంగా భాహిరంగంగానే వ్యతిరేకించారు. తరువాత జరిగిన పరిణామాలు రేవంత్ పార్టీ ని విడటం కాంగ్రెస్ లో కలవటం జరిగింది. ఈ నేపధ్యంలో టిడిపి-తెరాస పొత్తు కి ఎటువంటి అడ్డంకులు లేవు  లైన్ క్లియర్ అయింది. దీనికి   సంబంధించి  ఏ  పార్టీ నాయకుడు కూడా ఖండించా  లేదు, ఉండదు అని కూడా ఎవరూ  వ్యతిరేకించాలేదు. టిటిడిపి అద్యక్షుడు రమణ కూడా సానుకూలంగా ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఇటివల ఓ ఛానల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఏ రాజ‌కీయా పార్టీ కి మరో పార్టీ తో  శాశ్వత శ‌త్రుత్వం ఉండదు అని  అన్నారు. ఇదే సమయం లో నల్గొండ లో జరిగిన ఓ సమావేశంలో మేత్కుపల్లి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో  టిడిపి ఒంటరిగా పోటి చేస్తుంది అని రాష్ట్రం లో పార్టీ బలంగా ఉందని వచ్చే ఎన్నికలలో తమ భలం ఎంతో నిరుపిస్తామని చెప్పారు. ఇలా ఒకే పార్టీ కి సంభందించిన ఇద్దరు నాయకులూ విరుధంగా ప్రకటించడం వలన రాష్ట్రం లో ని కార్యకర్తలు కూడా గందరగోళానికి  గురి అవుతునారు. తమకి సరైన నాయకుడు సైతం లేడు అని ఫీల్ అవుతున్నారు ఆ ప్రాంతం లోని కార్యకర్తలు.


మరింత సమాచారం తెలుసుకోండి: