వైకాపా పార్టీ కి ప్రస్తుతం పవర్ ఆఫ్ సెంటర్ ఏంటి అంటే అందరూ ప్రశాంత్ కిషోర్ పేరే చెబుతారు. అంతగా ఆ పార్టీ కి పని చేస్తున్నారు ఆయన. జగన్ మోహన్ రెడ్డి సీనియర్ ల మాట వినకుండా ప్రశాంత్ మాట నే విని బోర్లా పడుతున్నారు అనీ,  ఆయన కేవలం ఉత్తరాది ప్రాంతానికి పనికొస్తాడు తప్ప దక్షిణాదిన ఇలాంటి వాళ్ళు చెల్లరు అని ఎంతమంది చెబుతున్నా జగన్ ఆయన మీద పెట్టిన నమ్మకం పక్కకి తీయడం లేదు.

టివిల్లో, సోషల్ మీడియాలో. ప్రశాంత్ కిషోర్ కి చాలా భారీ మొత్తమే ఇచ్చి జగన్ ఆయన్ని 2014 ఎలక్షన్స్ అయిన వెంటనే తనకి వ్యూహకర్తగా నియమించుకున్నాడనీ, ఆ మొత్తం కొన్ని వందల కోట్లనీ రూమర్లు కూడా నడిచాయి. అయితే ఇప్పుడు కొత్తగా మరొక రకమైన వార్తలు వస్తున్నాయి.

హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. ఇవి అవ్వగానే రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ ఎన్నికలు మొదలవుతాయి. వాటితో పాటు కర్ణాటక ఎన్నికలూ ఉన్నాయి. కానీ ఏ ఎన్నికల్లో ఏ పార్టీ విషయం లో కూడా ప్రశాంత్ కిషోర్ ఇంటర్ఫియర్ అవ్వడమే లేదు.అంటే ఆ రాష్ట్రాల్లో ఏ పార్టీ తరపునా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా కానీ కన్సల్టెంట్ గా కానీ ఆయన పనిచేయడం లేదు. ఇంకోరకంగా చెప్పాలంటే, వారెవ్వరూ ఈయన సలహాలు తీసుకోవడానికి కానీ ఈయన్ని వ్యూహకర్తగా నియమించడం కానీ చేయలేదు.

మూడేళ్ళ క్రితం ప్రశాంత్ కోసం క్యూ కట్టిన వారు ఇప్పుడు అతన్ని లైట్ తీసుకున్నారు అని టాక్. ప్రశాంత్ కిషోర్ దగ్గర ఒకప్పుడు 200 మంది ఉద్యోగులు ఉండేవారు అనీ ఇప్పుడు కేవలం యాభై మంది మాత్రమె ఉంటున్నారు అని న్యూస్ వినిపిస్తోంది. ప్రశాంత్ సీన్ అయిపోయిందని అని అందుకే అతన్ని ఇతర పార్టీలు దూరంగా పెడుతున్నాయి అనీ ఎంత వీలైతే అంత త్వరగా జగన్ కూడా అతన్ని వదిలించుకుంటే మంచిది అనీ విశ్లేషకుల వాదన. 


మరింత సమాచారం తెలుసుకోండి: