తెలంగాణ పోరాటంలో తన ఉద్యోగాన్ని సైతం పక్కనబెట్టి ప్రజల్లో కి వెళ్లి ఉద్యమ స్ఫూర్తిని నింపారు  టీజేఏసీ ఛైర్మ‌న్ ప్రొ.కోదండ‌రామ్.  తెలంగాణ వస్తే..ప్రయోజనం ఏంటీ అన్న విషయాన్ని ప్రతి పల్లెకు తిరిగి చెప్పారు. ఒకదశలో తెలంగాణ ఉద్యమానికి సీఎం కేసీఆర్ ఫ్యూహ కర్త అయితే..ప్రొ.కోదండ‌రామ్ ప్రచార కర్తగా ప్రజల్లోకి వెళ్లారు. 

తెలంగాణ ఏర్ప‌డి మూడున్న‌రేళ్లు గడుస్తోన్న‌ప్ప‌టికీ, ఇంకా రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెర‌వేర‌లేద‌ని ఆందోళన చేస్తోన్న టీజేఏసీ ఛైర్మ‌న్ ప్రొ.కోదండ‌రామ్ ఈ రోజు క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు.  ఇప్పటి వరకు ఎంతో మంది కొత్త పార్టీలు పెట్టారని..మరికొంత మంది వాటిని విలీనం చేశారని అన్నారు. 

అయితే గత కొంత కాలంగా తనను న‌ను రాజ‌కీయ పార్టీ పెట్టాల‌ని కోరుతున్నారని, పార్టీ పెట్టాల‌ని త‌న‌పై ఒత్తిడి ఉందని కీల‌క వ్యాఖ్య చేశారు. ఈ అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఈ నెల 30న హైద‌రాబాద్‌లో 'కొలువులకై కొట్లాట' సభ నిర్వ‌హిస్తున్నట్లు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: