భారత దేశంలో అత్యంత విషాదాన్ని నింపిన సంఘటన ముంబాయి పేలుళ్లు.  ఈ దురాఘతానికి మూల సూత్రదారి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం.  1993 లో ముంబాయి పేలుళ్ల తర్వాత భారత దేశాన్ని వదిలి పాకిస్థాన్ పారిపోయాడు దావూద్.  ప్రస్తుతం కరాచీలో తన నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్నట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి. 

తాజా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తులను అధికారులు వేలం వేశారు.  స్మగ్లర్లు, విదేశీ మారక మోసగాళ్లు (ఆస్తుల మోసగాళ్లు) చట్టం కింద ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ వేలాన్ని నిర్వహించింది. వేలంలో భాగంగా హోట్ రౌనఖ్ అఫ్రోజ్ అలియాస్ ఢిల్లీ జైకా, షబ్నమ్ గెస్ట్ హౌస్, దమర్వాలా భవనంలోని ఆరు రూములను వేలానికి పెట్టారు.

మూడు ఆస్తులపైనా సైఫీ బుర్హానీ అప్‌లిఫ్ట్‌మెంట్ ట్రస్ట్‌కు చెందిన వారే అధిక మొత్తంలో బిడ్ దాఖలు చేశారని వేలం నిర్వహించిన అధికారులు వెల్లడించారు. రౌనఖ్ అఫ్రోజ్ హోట‌ల్‌కు రూ.4.53 కోట్లు వస్తే.. షబ్నమ్ గెస్ట్ హౌస్ రూ.3.52 కోట్లు, దమర్వాలా బిల్డింగ్‌లోని ఆరు గదులు రూ.3.53 కోట్లకు అమ్ముడయ్యాయని చెప్పారు.   వేలానికి సంబంధించిన వివరాలను ఆ వేలం నిర్వహణలో పాల్గొన్న ఓ అధికారి వెల్లడించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: