మొత్తానికి ఎలా అయితేనేం కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ ఇస్థున్నట్లు ప్రకటించింది. అంతటితో ఆగకుండా ఆ ప్రక్రియను కూడా వేగవంతం చేసింది. అయితే ఇదంగా రాజకీయ ప్రయోజనాలు చూసుకునే చేస్తోందన్నది బహిరంగ రహస్యం. అయితే ఈ నిర్ణయం కారణంగా పార్టీల్లో దేనికి ఎక్కువ ప్రయోజనం అన్నది చూసుకుంటే కాంగ్రెస్ కే అని ఎవరైనా అంటారు. కానీ ఈ టోటల్ ఏపిసోడ్ లో హీరో ఎవరు, జీరో ఎవరు.. అన్నది ఆలోచించే ముందు తెలంగాణ ఇస్థున్నట్టు ప్రకటించిన కాంగ్రేస్ కు దానివల్ల ఒరిగిందేమిటి అన్నది ఓసారి ఆలోచించాలి. దీనివల్ల ఆ పార్టీ తెలంగాణలో హీరో అయ్యిందన్న వార్తలు ఇప్పటికే వెలువడ్డాయి. అంతే కాదు సీమాంధ్రలో జీరో అయ్యే ప్రమాదం వుందని సంకేతాలు వస్థున్నాయి. మరి ఇలా సగం రాష్ట్రంలో విఫలమై, మిగిలిన సగం రాష్ట్రంలో సపలమయై ప్రయోజనం ఏముంది? సైలెంట్ గా వుండి వుంటే రెండు చోట్లా ఎంతో కొంత అవకాశం వుండివుండేది కదా? కానీ ఇలా ఎందుకు చేసినట్లు?
ఇక తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ టిఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పన్నిన వూహం పుణ్యమా అని దాని అధినేత జీరో అయ్యారన్నది అందరిమాట.... ఒంటరిపోరాట కొనసాగిస్తారా..కాంగ్రేస్ లో కలిసిపోతారా అన్నది చూడాల్సి వుంది. టీఆర్ఎస్ పార్టీ ప్రజారాజ్యంలా కాలగర్భంలో కలిసిపోతుందా?.. అన్నది పక్కన బెట్టితే నిజంగా ఈరోజు ఈనిర్ణయం రావడానికి కారణం కెసిఆర్ ముందుకు తీసుకెళ్లిన ఉద్యమమే. అది తెలంగాణా జనాలకు గుర్తున్నంత కాలం కేసిఆర్ మరీ జీరోగా మారిపోయే అవకాశం వుండదు. అయితే ఇక్కడ ఓ సమస్య వుంది కాంగ్రెస్ లో కలిసిన తరువాత తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకున్న నాయకులు చరిత్రలో చాలా తక్కువ మంది వున్నారు. కెసిఆర్ ఈ విభాగాల్లో ఎటు చేరుతారో చూడాల్సి వుంది.
ఇక మరో మేజర్ పార్టీ తెలుగుదేశం, దాని అధినేత చంద్రబాబు... రెండుకళ్ల సిద్దాంతం, కీలకమైన సమయంలో మౌనం ఎలాంటి పలితం ఇచ్చిందంటే బుధవారం నాటి సీమాంధ్ర ఆందోళన మాత్రం ఆయనను ఆప్రాంతంలో జీరో చేసిందన్న సంకేతాలే కన్పించాయి. ఇక తెలంగాణలో కాంగ్రేస్ హీరో కాబట్టి ఇక్కడ చంద్రబాబు గూర్చి ఆలోచించాల్సిన అవసరం లేదంటున్నారు పరిశీలకులు. కానీ ఇక్కడ ఓ అడ్వంటేజ్ వుంది. కెసిఆర్ పార్టీ కాంగ్రస్ లో కలిస్తే, తెలంగాణాలో రెండు కీలక పార్టీలేవుంటాయి. వాటిలో దేశం ఒకటి. ఇక బిజేపి, సిపిఐల టాపిక్ ఇప్పుడు వినిపించకుండా పోయింది.
ఇక మరో ప్రధాన పార్టీ వైఎస్సార్ సిపి... దీనికి మొదటి నుంచి తెలంగాణలో వున్న పట్టు అంతంతమాత్రం. అందుకే కీలక సమయంలో తెగించి, సమైక్య రాగాన్ని వినిపించింది. సీమాంధ్రలో తనను ఎవరు బీట్ ఎవరు చేయనంతగా తన నిర్ణయాన్ని మార్చేసే సీమాంధ్రవైపు మారిపోయింది. ఇప్పుడు సీమాంధ్రలో అది మరో టిఆర్ఎస్ వలే అయిందన్న భావం కలిగించే ప్రయత్నంలో వుంది . కానీ తెలుగుదేశం పంచాయతీ ఎన్నికల్లో బాగానే పుంజుకుంది. సమైక్య సెంటిమెంట్ ను బలంగా వినిపించడం ద్వారా మాత్రమే వైకాపా దేశాన్ని మరింత బలంగా ఢీకొనగల అవకాశం వుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: