గతంలో ప్రచ్ఛన్న వ్యూహాలను అమలు జరపడం ద్వారా అంతర్జాతీయంగా మన దేశ ప్రభావం ప్రాభవం విస్తరించ కుండా చైనా ఒక సైంధవ పాత్రను పోషించింది. గత కొన్ని సంవత్సరాలు గా చైనా మనకు వ్యతిరేకంగా దౌత్యయుద్ధం ప్రత్యక్షం గానే సాగిస్తూ ఉండటం  చైనా విధానంలో వచ్చిన వ్యూహాత్మక మార్పుకు  నిదర్శనం.  చైనా ప్రభుత్వం నిర్లజ్జగా మనదేశంపై యునైటెడ్ నేషన్స్ వేదిక గా కాలకూట విషం కక్కుతోంది చైనా అనే డ్రాగన్ దేశం.

dragon china కోసం చిత్ర ఫలితం


మసూద్ అజార్ అన్న జిహాదీ హంతకుడిని బహిరంగంగా సమర్థిస్తుండడం చైనా ప్రభుత్వ వ్యూహంలోవచ్చిన అతిప్రమాద కరమైన మార్పునకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కానీ ‘జాయిష్-ఏ-మొహమ్మద్’ జిహాదీ మూకలోని మొదటి హంతకుడైన ‘మసూద్ అజార్’ ను తీవ్రమైన భారత వ్యతిరేఖ - గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించడాన్ని చైనా మాత్రం వ్యతిరేకిస్తోంది. మసూద్  అజార్  అంతర్జాతీయ ఉగ్రవాదని మనతోపాటు “ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి”  శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, ఫ్రాన్స్,  బ్రిటన్ లు ఇప్పటికే ప్రకటించాయి.

సంబంధిత చిత్రం
రష్యా ఈవిషయంలో తటస్థవైఖరి వహించినా దౌత్యంతో దాన్నిదారికితెచ్చుకోవచ్చు.సమస్యంతా చైనాతోనే. ఒకఅంతర్జాతీయ  ఉగ్రవాది కోసం చైనా ఇంతగా ప్రాకు లాడటం వెనుక ఉన్నచైనా ఆంతర్యాన్ని అంతర్జాతీయ సమాజానికి వెల్లడి చేయటంలో మోడీ దౌత్యనీతిని అభినందించవలసిందే. ఒక ఉగ్రవాది కోసమింతగా, అదీ వీటోపవర్ను వినియోగించటమంటే చైనా భారత్ కు ఏ స్థాయిలో ద్రోహం తలపెట్టటానికైనా సిద్ధమని జగద్విధితం.

masood azhar కోసం చిత్ర ఫలితం

*లడక్‌లో చైనా సైనిక ముష్కరులు ప్రణాలికా బద్దంగా జరిపిన చొరబాట్లు, దురాక్రమణ.

*అరుణాచల్ ప్రదేశ్‌ లో  అభివృద్ది, సంక్షేమ పథక కార్యక్రమాలను అమలు జరుపడానికి వీలుగా  ‘ఆసియా అభివృద్ధి బ్యాంక్’  మంజూరు చేసిన ఋణ సహాయాన్ని రద్దు చేయించడం,వ్యూహాత్మక దురాక్రమణ.

*న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ -ఎన్‌ఎస్‌జి - లో మన దేశానికి సభ్యత్వం లభించకుండా నిరోధించడం చైనా ఒడిగట్టిన ప్రచ్ఛన్న దౌత్య కుటిల నీతికి కుతంత్రాలకు ఇంకో ఉదాహరణ.

*మన దేశపు నైరుతి ప్రాంతంలోని హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాస్త్రీయ అన్వేషణలు ప్రయోగాలు మనదేశ సాగర తీరాన్ని రక్షించుకొనటానికి “ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ’, అనుమతిని కోరింది. కానీ దాదాపు పదేళ్ల పాటు మనకు అను మతి రావటాన్ని చైనా నిరోధిస్తూ వస్తుంది.  ఖాని 2011లో చైనా ప్రభుత్వానికి ఈ అనుమతి లభించడం ప్రచ్ఛన్న దౌత్య పోరులో ఒక మెట్టు.  

*లక్షద్వీపాలకు అత్యంత సమీపంలో నెలకొని ఉన్న మాల్‌దీవుల రాజధాని మాలేలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించ డానికై మన దేశానికి చెందిన "జి ఎం ఆర్ గ్రూప్" వాణిజ్య సంస్థతో కుదిరిన  ఒప్పందాన్ని చైనా రద్దు చేసేవరకు చైనా విశ్ర మించలేదు. ఆదే  విమానాశ్రయం నిర్మాణ కార్యక్రమాన్ని ఆ తరువాత చైనా సంస్థకు అప్పగించారు. దీంతో మాల్‌దీవులు చైనా స్థావరంగా మారడం మన సముద్ర రక్షణకు ఏర్పడిన కొత్త ప్రమాదం.

సంబంధిత చిత్రం

బ్రహ్మపుత్ర నదీ జలాలను మళ్లించుకొని పోవడానికై  “1000 కిలోమీటర్ల పొడవైన భారీ సొరంగ నిర్మాణాన్ని”  ప్రారంభించటానికి తన సర్వ శక్తులూ ఉప్యోగించటానికి నడుం బిగించడం మరో ఉదాహరణ. 

మన దేశంపట్ల చైనా ప్రభుత్వం ప్రదర్శిస్తున్నబహిరంగ వ్యతిరేకతకు కారణం మనప్రభుత్వం చైనా దురాక్రమణను ఎన్నడూ లేనంత తీవ్రంగా ప్రతిఘటిస్తుండడం నరెంద్ర మోడీ సారధ్యంలోని భారతీయ జనతా పార్టీ అధికారం లోకి వచ్చిన 2014 మే 26వ తేదీకి పూర్వం మన ప్రభుత్వం అనుసరించిన మెతక వైఖరి కారణంగా చైనా ప్రభుత్వం ఏళ్ల తరబడి తన వ్యూహాత్మక, భౌతిక దురాక్రమణను నిర్నిరోధంగా కొనసాగించింది! దీనికి  గత ప్రభుత్వాలు అవలంబించిన విదేశాంగ విధానం లోని మెతక వైఖరే. 
brahmaputra 1000 km tunnel by china కోసం చిత్ర ఫలితం

ఇదంతా 2014 మే 26వ తేదీకి పూర్వం జరిగిన చరిత్ర.తరువాత చైనా కలచెదిరింది కథ మారిపోయింది. అరుణాచల్ ప్రదేశ్‌ లోకి కాని, లడక్‌ లోకి కాని చైనా దళాలు చొర బడకుండా మన దళాలు నిరంతరం నిరోధిస్తున్నాయి.  లడక్‌లో ‘వాస్తవ అధీన రేఖ’ (LOC) ను దాటి చొరబడుతున్న చైనా సైనికులను మన ‘భారత్ టిబెట్ సరిహద్దు దళం’ - ఐటిబిపి- ఎక్కడికక్కడ అడ్డు కుంటోంది.  ఆ “లక్ష్మణ రేఖ”  దాటి చొరబడిన చైనా సైనిక  ముష్కరులను మన జవానులు మెడలను పట్టుకొని నెట్టుకుంటూ వెళ్లి  ఆ రేఖ బయటికి గెంటివేశారు. ఈ ప్రతిఘటన పెరిగిన తరువాత ‘లడక్’లో చైనా చొరబాట్లు దాదాపు ఆగిపోయాయి. గతం లో ఏ ప్రభుత్వమూ ఇంతగా చైనాను ప్రతి ఘటించలేక పోవటమే చైనా ఇంతగా పెట్రేగి పోవటానికి కారణం.
brahmaputra 1000 km tunnel by china కోసం చిత్ర ఫలితం

ఈశాన్య రాష్ట్రాలలో చైనా ప్రేరిత ఉగ్ర వాదులు దశాబ్ధాలుగా నిరంతర హత్యాకాండ, విచ్ఛిన్న కాండను కొనసాగించారు, మయ న్మార్‌లో మన సరిహద్దునకు సమీపంలో స్థావరాలను నెలకొల్పుకొని చైనా సాయుధదళాలు, మన సైనికులు వారిని తరిమి నప్పుడల్లా మయన్మార్‌లోకి పారిపోతున్నారు.  2015లో మన సైనికులు మయన్మార్‌ లోకి చొచ్చుకొనిపోయి ఈ చైనా స్థావరాలను ధ్వంసం చేశారు. ఈ -సర్జికల్ స్ట్రయిక్ - తరువాత చైనా ప్రభుత్వం ‘‘ఉగ్రవాదులతో మాకు ఎలాంటి సంబంధం లేదు, వారు మా సైనికులు కాదు’’ అంటూ కుటిలనీతిని ప్రదర్శించటం  ‘‘భుజాలు తడుముకున్నగుమ్మడి కాయల దొంగల’’ మాదిరిగా ప్రపంచానికి బట్టబయలు చేసింది.  చైనా తీవ్ర ధారుణాలను మన ప్రభుత్వం ఇలా  ‘‘మిన్నకుండే విధానానికి  తిలోద కాలిచ్చి ప్రతిఘటించే విధానం’’ అవలంభించటం చైనాను కలవరపరుస్తున్న పరిణామం. 
china penetrated in to mayanmar కోసం చిత్ర ఫలితం

ఇలా కలవరపడుతున్న చైనా ప్రభుత్వం ‘‘ప్రచ్ఛన్న వ్యతిరేక విధానానికి తిలోదకాలిచ్చి,  ప్రత్యక్ష పోరాటవ్యూహాన్ని”  అమలు చేయటం మొదలు పెట్టింది. వ్యూహాత్మకం గా భౌతికంగా మన ప్రతిఘటన పెరుగుతున్న కొద్దీ చైనా మనపై కొత్త కవ్వింపు చర్య లకు సిద్ధమౌతుంది.  

brahmaputra 1000 km tunnel by china కోసం చిత్ర ఫలితం

మసూద్ అజార్ అన్న భారత వ్యతిరేక పాకిస్తానీ ఉగ్రవాదిని నిర్లజ్జగా చంకనెత్తుకొని చైనా ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, మండలి అనుబంధ సంస్థల వేదికలపై బహిరంగ విన్యాసాలను సాగిస్తుండడం ఈ కవ్వింపు చర్యల లో ప్రధాన భాగం. మన దేశంలోని సిక్కింలోను, భూటాన్‌లోను విస్తరించి ఉన్న ‘డోక్‌లా’ భూభాగం లోకి చొరబడి, భారత అంతర్జాతీయ దౌత్యం ప్రభావంతోను భారత సైన్యం ప్రదర్శించిన “ఐ టు ఐ” తీరు తోను తోక ముడిచి వెళ్లిన చైనా డ్రాగన్  ఇలా ఐఖ్య రాజ్య సమితి లో ఇలా భారత వ్యతిరేక  జిహాదీ ముష్కరులకు అనాగరిక పాకిస్తాన్ లాగే పెంచి పోషించటానికి సిద్ధమవటమే కాదు వారికి నాయకత్వం కూడా వహిస్తోంది.

bhutan king jigme family కోసం చిత్ర ఫలితం

భూటాన్ రాజు  ‘జిగ్మే కేసర్ నామ్‌జ్ఞాల్ వాంగ్‌చుక్ భార్య తోను, కుమారుడితోను కలసి మనదేశంలో పర్యటిస్తున్న సమయం లోనే చైనా ఐఖ్యరాజ్యసమితిలో మరోసారి మసూద్ అజార్  కు అండగా నిలబడడం ‘డోక్‌లా’ గాయాన్ని గుర్తుచేసుకొని కలత పడి తిక్కగా తిరిగే పశుప్రవర్తనకు ఇంతకంటే ఋజువేముంటుంది. 
bhutan king jigme family కోసం చిత్ర ఫలితం

మసూద్ అజార్ వ్యవహారం లో చైనా ద్వారా మన దేశానికి మళ్లీ ఎదురు దెబ్బ తగిలినప్పటికీ, పాకిస్థాన్ పెంచి పోషించిన  పాకిస్థాన్ నిఘా సంస్థ ఐ.ఎస్.ఐ, నాయకత్వం వహిస్తున్న, జాయిష్ -ఏ- మొహమ్మద్ తదితర జిహాదీ సంస్థలకు అందుతున్న నిధులను నిరోధించడానికి  ఐఖ్యరాజ్యసమితి తన చర్యలను వేగవంతం చేయడంలో మన ప్రభుత్వం దౌత్యవిజయం సాధించింది.
సంబంధిత చిత్రం

ఈ నిధులను సమకూర్చుతున్న పాకిస్తాన్‌ ను ఐఖ్యరాజ్యసమితికి చెందిన "ఫైనాన్షియిల్ యాక్షన్ టాస్క్-ఫోర్స్"  బహిరంగం గానే  తప్పుపట్టింది. అర్జెంటీనా రాజధాని  'బ్యూనస్ ఎయిర్స్"  లో జరిగిన ఐఖ్యరాజ్యసమితి అనుబంధ సంస్థల సమావేశంలో పాకిస్తాన్‌ను గట్టిగా హెచ్చరిస్తూ తీర్మానంకూడా చేస్తూ నిధుల సరపరాను నిరోధించాలని పాకిస్తాన్‌ను కోరింది. ఇది నిజంగా చైనాకు ధారుణ పరాభవం మాత్రమే కాదు, పరోక్ష అభిశంసన కూడా.

సంబంధిత చిత్రం


మసూద్‌ అజర్ ను ‘గ్లోబల్ టెర్రరిస్టు’ గా ప్రకటించడాన్ని చైనా నిరోధించడానికి కారణం ‘ఐఖ్యరాజ్యసమితి -భద్రతా మండలి’ లో చైనాకున్న‘‘వీటో పవర్”మాత్రమే. ఐదు శాశ్వతసభ్యదేశాలకు (అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా) ఈ ‘వీటో’ అధికారా న్ని నాడు ఐఖ్య రాజ్య సమితి కట్ట బెట్టింది. మన దేశానికి శాశ్వత సభ్యత్వం లభ్యత కూడా ‘‘ఎండమావి లోని నీరు’’ లా తయా రైంది కారణం దశాబ్ధాల భారత పాలనా యంత్రాంగం యొక్క అంతర్జాతీయ వ్యవహారాల వైఫల్యం మాత్రమే. 

chaina crual attitude towards india కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: