అటు దక్షిణ భారతం బంగళూర్ పరప్పన అగ్రహార జైలులో సర్వ భోగాలు వైభవాలు అనుభవిస్తూ జీవిస్తున్నారు శశికళ.  ఆ బాగోతం లిఖిత పూర్వకంగా డి ఐ.జి. డి రూప తెలియజేశారు. అయినా మరో నేఱగాడు ఉత్తర భారతం లోని రోహతక్ జైలు లో అదే విధంగా సర్వ భోగాలు అనుభవిస్తున్నాడట.
DIG D Rupa కోసం చిత్ర ఫలితం

ప్రాంతం ప్రమేయం లేకుండా భారతంతా జైళ్ళలో కూడా సర్వసుఖాలు వైభోగాలు అనుభవించ వచ్చునని అని ఋజువైంది. దీనికి కావలసింది అడిగిన అధికారికి అడిగినంత లంచం యిస్తే చాలు జైల్ లో ఉండి వ్యాపారాలు కూడా చేసుకోవచ్చని గతం లోనే ఋజువైంది.   
rohtak jail & gurmeet కోసం చిత్ర ఫలితం

అత్యాచారం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా అధినేత గుర్మీత్ సింగ్ జైల్లో కనిపించడంలేదని ఒక ఖైదీతెలిపాడు  రాహుల్ అనే ఖైదీ రోహ్‌తక్ జైలు నుంచి మంగళవారం బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ సందర్భంగా రాహుల్‌ను గుర్మీత్ గురించి విలేకరులు ప్రశ్నించారు. తాను గుర్మీత్‌ను రోహతక్ జైల్లో చూడలేదని రాహుల్ తెలిపారు. తానే కాదు తన తోటి ఖైదీలు సైతం గుర్మీత్‌ను చూడలేదని స్పష్టం చేశాడు.
rohtak jail & gurmeet కోసం చిత్ర ఫలితం

జైల్లో ఖైదీలు పని చేస్తుంటారని, కానీ గుర్మీత్ సింగ్ మాత్రం పని స్థలంలో ఎప్పుడూ కనిపించలేదని రాహుల్ వెల్లడించాడు. తమ కుటుంబాలు తమను చూసేందుకు వస్తే ఇరవైనిమిషాలే మాట్లాడనిస్తున్నారని, అదే గుర్మీత్‌ సింగ్ కు రెండుగంటల  సమయం ఇస్తున్నారని రాహుల్ పేర్కొన్నారు. జైల్లో గుర్మీత్‌కు ప్రత్యేక సౌకర్యాలు కల్పించా రని ఆయన తెలిపారు.
rohtak jail & gurmeet కోసం చిత్ర ఫలితం
ఇద్దరు మహిళా సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో గుర్మీత్‌కు ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. గుర్మీత్‌కు శిక్ష పడిన నెల రోజులకే ఆయన దత్త పుత్రిక హనీప్రీత్‌ ను హరియాణా పోలీసులు అరెస్టు చేశారు.

Sasikala in parappana with all facilities కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: