తాను చాలా శక్తివంతురాలిని, బలవంతురాలిని, తెలివైనదానిని, తనకున్న జనబలం తో విర్రవీగుతూ సరిహద్దు దేశాలతో సరిహద్దు సమస్యలు సృష్టిస్తూ నిరంతర "జగడాల మారి" డ్రాగన్ చినా ని నిలువరించటానికి నరెంద్ర మోడీ సమాయత్తమౌతు న్నారు. తాజాగా జగడాల మారి చైనాను అడ్డుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్న ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జరగనున్న మన గణతంత్ర దినోత్సవ వేడుకకు "ఆసియాన్ దేశాల అధినేతలు" ను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు.
quadrilateral quad to stop china కోసం చిత్ర ఫలితం

125 కోట్ల మంది భారతీయులు మిమ్మల్ని సాదరంగా స్వాగతించటానికి నిరీక్షిస్తూ ఉన్నారని నరెంద్ర మోదీ ట్వీట్ చేశారు. చైనా పొరుగున ఉండే ఈ ఆసియాన్ సభ్య దేశాల తో చెలిమి ద్వారా డ్రాగన్‌ కు చెక్ పెట్టాలని భారత్ భావిస్తోంది. ఆసియాన్-ఇండియా సదస్సులో నరెంద్ర మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదం, వేర్పాటు వాదం ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య లని అవరోధాలని అని తెలిపారు. వీటిని ఎదుర్కోవడానికి ఈ ప్రాంతం లోని దేశాలన్ని కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. ఒక్కొక్కరు గా ఉగ్రవాదంపై పోరాడటం ఎంతో కష్టం. దీన్ని ఉమ్మడి గానే సమర్థవంతంగా ఎదుర్కోగలం అని మన ప్రధాని నరెంద్ర మోదీ చెప్పారు.
quadrilateral quad to stop china కోసం చిత్ర ఫలితం

ఆసియాన్‌ గా అభివర్ణించే "అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్‌" సదస్సులో థాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియా, మలేసియా, ఫిలిప్పిన్స్, సింగపూర్, మయన్మార్, కాంబోడియా, లావోస్, బ్రూనై దేశాలకు సభ్యత్వం ఉంది.  ఈ ఆసియాన్ సభ్య దేశాలు ఇండియా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలతో "స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు" చేసుకున్నాయి.
quadrilateral quad to stop china కోసం చిత్ర ఫలితం

ఆసియాన్ దేశాల్లో దాదపుగా 185 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ దేశాల సమ్యుక్త జీడీపీ 3.8 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఆసియాన్ దేశాలు భారత్‌ లో గత 17 ఏళ్ల లో 70 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాయి. ఇది భారత్‌కు వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 17 శాతం కంటే అధికం. అదే సమయంలో భారత్ ఆ దేశాల్లో 40 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడు లు పెట్టింది. మెజార్టీ ఆసియాన్ దేశాలకు దక్షిణ చైనా సముద్రం విషయమై జగడాల మారి  డ్రాగన్ చైనాతో వివాదాలున్నాయి.
quadrilateral quad to stop china కోసం చిత్ర ఫలితం
ఈ వ్యూహానికి తోడుగా - దక్షిణ చైనా సముద్రంపై పూర్తి పెత్తనం కోరుతున్న చైనా ఆటలు సాగకుండా "అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా" తో కూడిన నాలుగుదేశాల కూటమి (క్వాడ్రిలేటరల్‌ క్వాడ్) అవసరమని జపాన్‌ ప్రధాని షింజో అబే 2007 లోనే సూచించారు. ఐతే మరల జపాన్‌ ప్రధానిగా షింజో అబే ఎన్నికకావటంతో ఈ "చైనా వ్యతి రేక కూటమి" -  చతుర్భజం ఐడియా అదే "క్వాడ్రిలేటరల్‌ క్వాడ్"ను ఒక దాశాబ్ధం తరవాత దుమ్ము దులిపి ప్రాణంపోసి అమలు చెయ్యాలన్న ప్రతిపాదన కు ఆమోదం లభించింది. 


"బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చావదే" అన్న సూక్తి ఇక్కడ దేశాల ఐఖ్యతతో సిద్ధించటం తధ్యం. నరెంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్వహించిన తొలి రిపబ్లిక్ - డే వేడులకు నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంటే రెండో ఏడాది  ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్సిస్‌ హోలాండో  ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఏడాది మూడో ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాకుమారుడు మహమ్మద్‌ బిన్‌-జియాద్‌ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. 

quadrilateral quad to stop china కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: