కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్‌ వద్ద ప్రమాదం జరిగింది. సింపుల్‌ వాటర్‌ స్పోర్ట్స్‌ సంస్థకు చెందిన పర్యాటకుల బోటు కృష్ణానదిలో తిరగబడి 20 మంది దుర్మరణం చెందారు.  భవాని ఐలాండ్ నుంచి పవిత్ర సంగమం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై  వెంటనే స్పందించిన ఏపీ ప్రభుత్వం మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.  మరోవైపు విజయవాడ పవిత్ర సంగమం ఘటన అధికార, ప్రతిపక్ష నేతల దృక్పథాలను మరోసారి బహిర్గతం చేసింది. 

Image result for krishna district boat accident

ఎవరి మైండ్ సెట్ ఎలా ఉందో ఏపీ జనం అర్థం చేసుకునే అవకాశం కల్పించింది. 20 మంది ప్రమాదంలో మరణించడం దారుణమే అయినా.. అలాంటి విపత్కర సమయంలో ఇరు పక్షాల నేతల ప్రవర్తన చర్చనీయాంశమైంది. ప్రమాదం జరిగిన సమయంలో వైసీపీ నేతలు,జోగి రమేష్ వ్యవహరించిన తీరు ఆ పార్టీకి తీవ్ర నష్టం కలిగించింది.ఓ వైపు పెను విషాదం జరిగి సహాయ చర్యలు కోసం అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతున్న సమయంలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు అమానవీయంగా ఉంది.

Image result for krishna district boat accident

చివరకు క్షతగాత్రులను తీసుకెళ్లే అంబులెన్స్ కు అడ్డంగా కూర్చుని రాజకీయం చేయాలనుకోవడం ఆశ్చర్యపరిచింది. చివరకు ఒకానొక దశలో విజయవాడ పోలీసు కమిషనర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది.పోలీసుల హెచ్చరికలతో చివరకు అక్కడి నుంచి వైసీపీ నేతలు జారుకున్నారు. బాధలో ఉన్నవారికి సహాయం చేయాలన్న ఆలోచన కాకుండా జరిగిన ఘటనను రాజకీయంగా వాడుకోవాలన్న తపన వారిలో కనిపించడం రాష్ట్ర ప్రజల దృష్టిని దాటి పోలేదు. 

Image result for కృష్ణ నదిలో బోటు ప్రమాదం

మరోవైపు ప్రమాద సంఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు కేరళ నుంచే స్పందించారు. మంత్రులను అప్రమత్తం చేశారు. సీఎం నగరానికి వచ్చీ రావటంతోనే నేరుగా సంఘటనా స్థలానికి వెళ్లారు. ఆసుపత్రిలో రోగులను పరామర్శించారు. బాధితులకు పరిహారం ప్రకటించారు. అంతే కాదు కాపాడిన జాలర్లకు కూడా5 లక్షల నజరానా ప్రటించారు. ఇదీ చిత్తశుద్ధి గల నాయకులకూ... రాజకీయం కోరే నాయకులకూ ఉన్న స్పష్టమైన తేడా. 


మరింత సమాచారం తెలుసుకోండి: