సర్వేలంటే ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఎంత ఇష్ట‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు! అధికారంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ దాదాపు ప్ర‌తి అంశంపైనా అయ‌న త‌న సీక్రెట్ ఏజెంట్ల‌తో వీటిని నిర్వ‌హిస్తూనే ఉంటారు. ఇందులో వ‌చ్చిన ఫ‌లితాల ఆధారంగా.. పాల‌న‌లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు! అంతేగాక ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు సల‌హాలు, సూచ‌న‌లు, ప్ర‌త్యేక క్లాసులు ఇస్తూ ఉండటం కూడా తెలిసిందే! ముఖ్యంగా ఎన్నిక‌ల మూడ్ క‌నిపిస్తుండ‌టంతో.. ప్ర‌జ‌ల్లో పార్టీపై ఉన్న అభిప్రాయాలు, ఎమ్మెల్యేలు, మంత్రుల ప‌నితీరుపై సర్వే నిర్వ‌హించారట‌. అయితే ఇందులో ఫ‌లితాలు చూసిన చంద్ర‌బాబుకు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అయినంత ప‌ని అయింద‌ట. ఏపీలో అవినీతి ఓ స్థాయిలో వేళ్లూనుకుపోయింద‌ని ఇందులో తేలడంతో ఆయ‌న‌కు షాక్‌కు గుర‌య్యార‌ట‌!! 

రాష్ట్రంలో ఏమాత్రం అవినీతికి ఆస్కార‌మే లేదని, అవినీతికి పాల్ప‌డుతున్న‌ వారు ఎంత‌టి వారైనా స‌హించేది లేద‌ని సీఎం చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతూ ఉంటారు. వివిధ స‌ర్వేలు నిర్వ‌హించ‌గా వ‌చ్చిన ఫ‌లితాల ఆధారంగానే.. ఒక్కోసారి ఎమ్మెల్యేలకు హెచ్చ‌రిక‌లు కూడా జారీచేస్తుంటారు! సర్వేల్లో వ‌చ్చిన ఫ‌లితాలు.. నూరు శాతం న‌మ్మ‌క పోయినా.. అందులో 70 శాతం విశ్వసిస్తుంటారు చంద్ర‌బాబు! అయితే ఏపీలో విప‌రీతంగా అవినీతి జ‌రుగుతోంద‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు ప‌దేప‌దే ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. ఇసుక వ్యాపారం, భూక‌బ్జాల‌పై త‌ర‌చూ ఆరోప‌ణ‌లు వినిపిస్తూనే ఉంటాయి. మ‌రి ఇది నిజ‌మో కాదో తెలుసుకోవాల‌నిపించిందో లేక‌.. యాదృశ్చికంగా చేశారో తెలీదుగాని.. ఇప్పుడు ఒక స‌ర్వేలో ఆస‌క్తిక‌ర ఫలితాలు వ‌చ్చాయి!  

ఇక భవననిర్మాణ అనుమతుల విషయానికి వస్తే సర్వేలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అంటే 100 శాతం మంది ఈ విషయంలో అవినీతి దారుణంగా ఉందని తేల్చి చెప్పార‌ట‌. ఇక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనూ అవినీతి రాజ్యమేలుతున్నట్టు సర్వేలో తేల్చారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన స‌ర్వేలో ప్ర‌భుత్వంపై సంతృప్తి స్థాయి 70-75 శాతం ఉంద‌ని, ఇది 100 శాతానికి పెర‌గాల‌ని ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు సూచించిన విష‌యం తెలిసిందే! ఈ స‌ర్వే నిర్వ‌హించిన కొన్ని రోజుల‌కే అవినీతి పెరిగిపోయింద‌ని రావ‌డం.. నిజంగా చంద్రబాబు ఆలోచించాల్సిన విష‌య‌మే! ముఖ్యంగా ఎన్నిక‌ల సమ‌యంలో ఇలాంటివి మ‌రింత షాకింగ్‌గా అనిపించ‌వ‌చ్చు!!

మరింత సమాచారం తెలుసుకోండి: