కాంగ్రెస్  ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఆ నాయకులు యువరాజు అని పిలుచుకుంటారు.  కానీ ఆయన వ్యతిరేకులు మాత్రం ఈ మద్య రాహుల్ గాంధీ పప్పు అని సంబోదిస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఉద్దేశించి ప్రచార కార్యక్రమాల్లో ‘పప్పు’ అనే పదాన్ని వినియోగించడాన్ని గుజరాత్‌ ఎన్నికల కమిషన్‌ నిషేధించింది. 

ఎన్నికల ప్రచారం లో భాగంగా ఓ ఎలక్ట్రానిక్‌ ప్రచార కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాహుల్‌ను ఉద్దేశించి ’పప్పు’ పదాన్ని వినియోగించడానికి ఈసీకి స్క్రిప్టును పంపింది. దీనిపై ఎన్నికల కమీషన్ సీరియస్ అయ్యింది.  ప్రజలు ఆదరిస్తున్న ఓ నాయకున్ని ‘పప్పు’ అని పిలవడం చాలా అసభ్యంగా ఉందని చెప్పింది. అంతే కాదు అలా  పిలవడం ఆయన్ను అవమానించినట్లే అని పేర్కొంది. 
Image result for bjp
దీనిపై స్పందించిన అది కేవలం  గుజరాత్‌ బీజేపీ శ్రేణులు అడ్వర్టైస్‌మెంట్‌లో వినియోగించిన స్క్రిప్ట్‌ ఏ నాయకుడిని ఉద్దేశించి కాదని పేర్కొన్నాయి.  అయితే ప్రచార కార్యక్రమాల స్క్రిప్టును ఈసీ నేతృత్వంలోని మీడియా కమిటీకి పంపించి, వారి పరిశీలన అనంతరం వాడుతామని, 'పప్పు' పదం తొలగిస్తూ, సరికొత్త స్క్రిప్టును తయారు చేసి మరోసారి పరిశీలనకు పంపుతామని పేర్కొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: