తెలుగుదేశం ప్రభుత్వం పాలన ఆంధ్రప్రదేశ్ లో కుల ప్రాతిపదికనే జరుగుతుందనేది పలుమార్లు ఋజువౌతుంది. ముఖ్యం గా అధికార పార్టీ అధినేత కులానికే రాష్ట్రం అందించగల  ప్రయోజనాలు లభిస్తుండటం మిగిలిన కులస్తులకు భేద భావం క్రమంగా ఇతర కులాల్లో పెరిగిపోతుంది. దీనికి కారణం ఆ పార్టీ అధినేత, మంత్రులు చివరకు సాధారణ ప్రజా ప్రతి నిధుల వరకు కుల, బంధు, ప్రాంత ప్రీతి తో సతమతం ఔతున్నారు.


andhra pradesh nandi awards a farse కోసం చిత్ర ఫలితం


తాజాగా రాష్ట్రంలో కలకలం రేపిన విషయం "ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుల ప్రధానోత్సవం" ఇందులోనే వారి కులం బందు ప్రాంత ప్రీతి ప్రభావం ప్రస్పుటంగా బయట పడింది. ముఖ్యంగా చెప్పేదేమంటే ఈ దేశానికే అంతర్జాతీయ స్థాయి సినిమాకు కథానాయకుడుగా దుర్నిరీక్ష్య ప్రతిభావంతమైన ప్రభావశీల నటన ప్రదర్శించిన ప్రభాస్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారు. రమ్యకృష్ణ, అనుష్క, రానాలకు ధీటైన నటన కథానాయక పాత్రలో ప్రదర్శించిన ఆయన్ను విస్మరించటానికి ప్రధాన కారణం కులం కాక మరేమిటి అంటున్నారు బాహుబలి ప్రేమికులు.


andhra pradesh nandi awards a farse కోసం చిత్ర ఫలితం


శ్రీమంతుడు ఒక అద్భుతమైన సినిమా కాదని ఎవరూ అనలేరు. కాని కాని అందులో మహెష్ బాబు నటన అసాధారణం కాదు. బాహుబలి-1 లో ప్రభాస్ నటనే అత్యద్భుతం. ఐదేళ్ళు తన విలువైన సమయాన్ని ఒకే ఒక్క సినిమా కోసం త్యాగం చేసి మనసా వాచా కర్మణా సర్వస్వాన్ని త్యజించి దర్శకుణ్ణి సంత్రుప్తి పరచిన ప్రభాస్ ప్రభుత్వ పరంగా దక్కిన గౌరవం శూన్యం అనిచెప్ప వచ్చు. పద్దెనిమిది వందల కోట్ల వసూళ్ళు సాధించిన సినిమాలోని కథానాయకుణ్ణి గుర్తించిందెక్కడ? 


అయితే ప్రభాస్ ఒక సార్వభౌమునిగా అద్వితీయ నటన ప్రదర్శించారు. అనుష్క మహారాణి దేవసేనగా డీ-గ్లామర్ పాత్రకే ఒక వైభవం తెచ్చారు. వారిద్దరికీ నంది అవార్డ్ రాకపోవటం వెనుక కుతంత్రం ఏమైనా ఉందా? అని రంద్రాన్వేషణకు కమిటీ హెడ్ జీవిత తావిచ్చారు. 

manam cinema images కోసం చిత్ర ఫలితం


ఆంధ్ర  సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రతిబింబించిన రుద్రమదేవికి నాడు వినోదపన్ను విషయం లో వివక్ష చూపిన ఏపి ప్రభుత్వం అసలు మన సంస్కృతినే ప్రదర్శించని గౌతమీపుత్ర శాతకర్ణికి ఆ ప్రయోజనం చేకూర్చింది ఎందుకో?  అందరికీ తెలుసు. కనీసం నంది అవార్డుల ప్రధానంలోనైనా రుద్రమదేవికి గుర్తింపు  యివ్వలేదు. శీను వైట్లకు అసలు అవార్డ్ యివ్వ వలసిన అవసరమేముంది? గుణశేఖర్ ను ధారుణంగా విస్మరించటం ఎంతవరకు సహేతుకం? 


gunasekhar & rudramadevi కోసం చిత్ర ఫలితం

చివరకు ఒక దశాబ్ధం తరవాత తిరిగివచ్చి తెలుగు చిత్రసీమలో వసూళ్ళ రికార్డులు బ్రేక్-చేసిన చిరంజీవికి అవార్డ్ యివ్వలేదు సరికదా, మెగా కుటుంబ కథానాయకులు ఏ ఒక్కరికి సరైన అవార్డు యివ్వకపోవటం వారిని పూర్తి నిరాదరణకు గురిచేసినట్లే అల్లు అర్జున్ కు కారక్టర్ నటుడుగా నంది అవార్డ్ కూడా ఆయనకు తగనిదే. 


mega heroes images కోసం చిత్ర ఫలితం


ఇక లెజెండ్ వంటి భీకర భయానక హింసాత్మక చిత్రానికి అవార్డుల పంటపండింది.  కారణం అందరికీ తెలిసినదే. ముఖ్య మంత్రి గారి బామ్మర్ది హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ఆ సినిమాలో కథానాయకుడు కావటమే. ఏ ఒక్కరు పక్షపాతరహితంగా ఆలోచించించినా ఇది ఘోరం మాత్రమేకాదు అన్యాయం కూడా.


మనం లాంటి మంచి కుటుంబ చిత్రం ముందు లెజెండ్ పోలదు. జన హృదయాలను పన్నీటిలో ఓల లాడించిన మనం స్థాయి ఎక్కడ, రక్తంలో ముంచి తేల్చిన లెజెండ్ స్థాయి ఏమిటి? 

సంబంధిత చిత్రం

టాలీవుడ్ నుండి బాలీవుడ్ స్థాయికి ఎదిగి అంతర్జాతీయ కథానాయకునికి ఈ అవార్డుల్లో స్థానం లేదా? ఇక్కడ పక్షపాతం నిర్లజ్జగా కనిపిస్తుంది.

సంబంధిత చిత్రం

ఈ విషయంలో ముఖ్యమంత్రి సార్వం సహా సార్వభౌముడు,  బాలకృష్ణ రాజ్యాశ్యాలకుడు. పాత విఠలాచార్య సినిమాల్లో ఈ రాజ్యాశ్యాలకుడు జన ద్రోహి మాత్రమే. ఈ ప్రజాస్వామ్యంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా రాజ్యాశ్యాలకులను భరించవలసిందే. తప్పదు అనేది ఋజువౌతుందని మరోసారి జనం గుర్తించారు. ఈ దెబ్బకి టిడిపి కావలసినంత ప్రజా వ్యతి రేఖతను 100%  పోగేసుకుంటుంది. ఇది నిజం.


balakrishna chandrababu seenu vaitla కోసం చిత్ర ఫలితం

నంది అవార్డులు బహూకరించలేదు వాటిని తమ వాళ్లకు పంచారు. ఈ అవార్డ్ రాని వాళ్ళె ఉత్తములు. ప్రభుత్వం నుండి అవార్డ్ పొందిన వాళ్ళు ఉత్తుత్తివాళ్ళు అని గమనిస్తే సరిపోతుందంటున్నారు.  ఇలా కళను కించపరచిన ప్రభుత్వానికి పతనం ప్రారంభమైనట్లే అంటున్నారు జనం.  



సంబంధిత చిత్రం

రాత్రి ప్రసన్న అనే ఒక మహనీయుడు టివి-9 బిగ్-డిబేట్ లో లెజెండ్ సినిమా నేపద్యం భౄణహత్యలనిన్నినూ, 1100 రొజులాడిన అత్యద్భుత దృశ్యకావ్యమని వసూళ్లు అద్భుతమనీను ప్రవచించటం జాతికి ఏ సిగ్గుమాలిన సమాధానం చెప్పారో ప్రజలు చెవుల్లో కాలిఫ్లవర్లు పెట్టుకొని చూట్టలేదని అంటూ ఆయన్ని వెటకారం చేయటం ఆయనకు తెలిస్తే ...   ఏ ఇద్దరు ముగ్గురు కలసినా ఇదే విషయం పై చర్చిస్తున్నారు. పచ్చ మీడియా కూడా ఇక వీళ్ళను రక్షించలేదు.   

మరింత సమాచారం తెలుసుకోండి: