పోలవరం ప్రాజెక్టు పనుల విషయం లో ఏపీ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. రాబోయే ఎన్నికలకి దీన్ని ఓట్లు అడగడం లో ముఖ్య ప్రాతిపదికగా తీసుకున్నారు చంద్రబాబు. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి అపర భగీరధుడు గా పేరు గాంచాలి అనేది చంద్రబాబు ప్లాన్.

ఆ దెబ్బతో రైతులకి తన ఐదేళ్ళ పాలన లో మంచి జరిగింది అని బహిరంగంగా చెప్పుకుని ఓట్లు అడిగే ఛాన్స్ ఉంది మరి. కానీ ఈ పోలవరం పూర్తి అయ్యే విషయం లో చంద్రబాబు కి చుక్కలు చూపిస్తోంది కేంద్ర ప్రభుత్వం. పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ పొంతన లేకుండా కొట్టుకుంటూ ఉన్నాయి ఏపీ - కేంద్ర ప్రభుత్వాలు.

ఈ పరిస్థితి లో పోలవరం ముందుకు సాగి చంద్రబాబు కి ఓటు బ్యాంకు గెలిపించడం అటుంచి అటు తిరిగీ ఇటు తిరిగీ ఈ పోలవరమే అతిపెద్ద తలనొప్పిగా మారేలా కనిపిస్తోంది ఆయనకి. ఇలాంటి టైం లో రంగంలోకి దిగి చంద్రబాబు ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు సుజనా చౌదరి రీసెంట్ గా ఆయన హుటాహుటిన డిల్లీ వెళ్లి కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ ని కలిసి మాట్లాడారు.

ప్రాజెక్టు నిర్మాణం ఇక‌పై ఆల‌స్యం జ‌ర‌క్కుండా ఉండేలా అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటున్న‌ట్టు సుజ‌నా చెప్పారు. పోల‌వ‌రం స‌మ‌స్య‌ల‌పై ఓ ప్ర‌త్యేకమైన స‌ద‌స్సు ఏర్పాటు చేసి, అన్ని స‌మ‌స్య‌ల‌నూ అర్థం చేసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉంద‌ని ఆయ‌న తెలిపారు.

ఓ వారం రోజుల్లోనే స‌మావేశం ఉంటుంద‌నీ, అన్ని స‌మ‌స్య‌లూ అక్క‌డితో ప‌రిష్కృతం అవుతాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. సుజనా కొందరు ఎంపీలని తీసుకుని మరీ నితిన్ ని కలిసి విషయం చెప్పి కేంద్రం - ఏపీ ప్రభుత్వాల మధ్యన పొరుపోచ్చులు రాకుండా కాపాడారు . త్వరలో సదస్సు ఉంటుంది ఆ తరువాత కూడా అంతా క్లారిటీ తో ముందుకు తీసుకుని వెళ్ళే బాధ్యత సుజన తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: