భారత దేశంలో కొంత కాలంగా మహిళలు, యువతులు చివరికి చిన్నారులపై అత్యాచారాలు, హత్యల పరంప కొనసాగుతుంది.  చట్టాలు ఎంత కఠిన శిక్షలు విధిస్తున్నా మృగాళ్ల దాడులు ఆగడం లేదు. ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఈ వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి.  గాంధీ మహాత్ముడు అన్నట్లు అర్థరాత్రి మహిళ ఒంటరిగా తిరిగినపుడే పూర్తి స్వాతంత్ర్యం వచ్చినట్లు అన్నారు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో పట్టపగలు కూడా మహిళలు బయట తిరగలేని పరిస్థితి దాపురించింది. 

తాజాగా ఓ కాలేజీ విద్యార్థినిపై కొంత మంది యువకులు అత్యంత దారుణంగా అత్యాచారం చేసిన ఘటన  ఒడిశాలో జరిగింది.  ఈ సంఘటనలో చట్టాలను కాపాడే పోలీసుల పాత్ర గురించి తెలిస్తే వ్యవస్థ మీద ఏవగింపు పుడుతుంది. ఒడిశాలోని మైథిలీ పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 7న జరిగింది ఈ దుర్ఘటన.  బాధితురాలు ప్రాక్టికల్‌ తరగతులు ముగించుకుని ఇంటికి వెళుతోంది. కొంత దూరం వెళ్ళాక  హ్యాండు బ్యాగు మరిచిపోయిన విషయం  గుర్తుకొచ్చి వెంటనే కాలేజీకి పరుగెత్తుకు వెళ్ళింది. 

అక్కడే  ముగ్గురు మృగాళ్లు  కూర్చుని మద్యం తాగి వున్నారు. హ్యాండుబ్యాగు కోసం వెళ్లిన అమ్మాయిని చూసి రాక్షసుల్లా ఆమె మీద పడ్డారు. ఎంత బ్రతిమలాడినా..వినకుండా అత్యాచారానికి పాల్పపడుతూ... ఆ ఘోరాన్ని ఫోనులో వీడియో తీశారు. ఆ యువతి ఆర్తనాదాలు విని ఓ లెక్చరర్ అక్కడకు వచ్చి వారిని  ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. వారు  లెక్చరర్‌పై కత్తులతో దాడి చేశారు.

 ఈ ఘటనపై లెక్చరర్‌తో కలిసి బాధితురాలు నవంబర్‌ 9న పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లడంతో..ద్దరు నిందితులను  అరెస్ట్‌ చేశారు. ఇంకొక నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: