మన కాశ్మీర్ నాయకులు తీరొక లెక్కన మాట్లాదతారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా మళ్లీ పాకిస్థాన్‌ వన్పాట పాడారు. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పీవోకే) భారత్‌లో అంతర్భాగం కాదంటూ వ్యాఖ్యలు చేసిన వారం లోనే మరో వివాదానికి తెరతీశారు. 'పీవోకే' విషయంలో చూస్తూ ఊరుకోవడానికి పాకిస్థాన్‌ గాజులు తొడుక్కోలేదంటూ బారాముల్లాలో వ్యాఖ్యానించారు. 


farooq abdullah recent comments about pok కోసం చిత్ర ఫలితం


"పీవోకే భారత్‌లో అంతర్భాగమంటే చూస్తూ ఊరుకోవడానికి పాక్‌ గాజులు తొడుక్కుని కూర్చోలేదు. వాళ్లేం బలహీనులు కాదు. పాక్‌ దగ్గరా అణుబాంబులున్నాయి.  యుద్ధం గురించి ఆలోచించే ముందు ఇక్కడ మనుషులుగా బతగ్గలమా?  అని ఆలో చించాలి" అంటూ ఫరూఖ్‌ అబ్దుల్లా అన్న మాటలు మంటలు రేపుతున్నాయి. "పీవోకే భారత్‌లో అంతర్భాగమని ఇంకా ఎంతకాలం చెబుతూ వస్తారు? 70 ఏళ్లు గడిచిపోయాయి. కానీ పీవోకేని భారత్‌ సొంతం చేసుకోలేకపోయింది. ముమ్మాటికీ పీవోకే పాకిస్థాన్‌ లో అంత ర్భాగమే" అన్న ఫరూఖ్‌ అబ్దుల్లా మాటలు చర్చనీయ అంశమయ్యాయి.


farooq abdullah recent comments about pok కోసం చిత్ర ఫలితం



పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) పాకిస్తాన్‌ దేనంటూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల ను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్‌ అహిర్‌ ఖండించారు. "పీవోకే భారత్‌దేనని, గత ప్రభుత్వాలు చేసిన పొరపాట్ల వల్ల ఈ ప్రాంతం పాక్‌ ఆధీనంలోకి వెళ్లిపోయిందని ఆయన అన్నారు. మనం ప్రయత్నిస్తే పీవోకే మళ్లీ మన సొంతం అవుతుంది. ఎందుకంటే అది మన హక్కు. పీవోకే తిరిగి మనం అధీనంలోకి తెచ్చుకునేందుకు మేం కృషి చేస్తాం" అని హన్స్‌రాజ్‌ తెలిపారు.

farooq abdullah recent comments about pok కోసం చిత్ర ఫలితం



పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) పాకిస్తాన్‌దే అంటూ గతవారం వ్యాఖ్యలు చేసిన ఫరూక్‌ అబ్దుల్లా మరోసారి వివాదాస్పదంగా మాట్లా డారు. పీవోకేను భారత్‌ ఆక్రమించుకునే అవకాశం ఇచ్చేంత బలహీన దేశం పాక్‌ కాదని ఆయన బుధవారం అన్నారు. బారాముల్లా జిల్లాలోని ఉడీ ప్రాంతంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అబ్దుల్లా ప్రసంగించారు. ‘ఇంకా ఎంత కాలం పీవోకే మనదేనని ఈ దేశం చెప్పుకుంటూ ఉంటుంది? అది వీళ్ల అబ్బ సొత్తేమీ కాదు. పీవోకే పాకిస్తాన్‌దే. జమ్మూ కశ్మీర్‌ భారత్‌ది. (70) ఏళ్లయినా పీవోకేను భారత్‌ తన అధీనంలోకి తెచ్చుకోలేకపోయింది.

farooq abdullah recent comments about pok కోసం చిత్ర ఫలితం



కానీ స్వాధీనం చేసుకుంటామని చెబుతూనే ఉంది. ఇది ఎలా జరగుతుందో మేమూ చూస్తాం. పాకిస్తాన్‌ ఏమీ బలహీన దేశం కాదు.వాళ్లు గాజులు తొడుక్కోలేదు. వాళ్ల దగ్గరా అణుబాంబులు ఉన్నాయి. యుద్ధం గురించి ఆలోచించేముందు మనుషులుగా బతకడం గురించి ఆలోచించాలి’ అని అబ్దుల్లా అన్నారు. నియంత్రణ రేఖ వద్ద ఇరుదేశాల ప్రజలు స్వేచ్ఛగా తిరిగే రోజు వస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి, అక్కడి ప్రజలకు ప్రత్యేక వెసులుబాట్లు, రాయితీ లు తదితరాలు కల్పిస్తూ 1953 లో తెచ్చిన చట్టాలన్నింటినీ తొలగించే కాలం కూడా వచ్చిందంటూ కేంద్ర ప్రభుత్వం పై ఆయన ఆరోపణలు చేశారు.


hans raj comment on farooq abdullah కోసం చిత్ర ఫలితం

Union Minister Hansraj Ahir today said no one could stop India if it wanted to wrest PoK from Pakistan, stressing that the territory was a part of India. 

"I say Pakistan-occupied-Kashmir is a part of India and due to the mistakes of the previous governments, it has been with Pakistan. If we try to get PoK back, no one can stop us because it is our right," he said on the sidelines of a function here

మరింత సమాచారం తెలుసుకోండి: