ప్రస్తుతానికి భారత ప్రధానికి ఇంటా బయటా ప్రత్యామ్నాయం ఏర్పడే పరిస్థితులు కనిపించటం లేదు. ప్రతిపక్షాలన్నీ అధి కారం లోకి రావటానికి దేశ ప్రయోజనాల్ని సైతం ఫణంగా పెట్టే దిశలో పయనిస్తున్నాయి. జనం దీన్ని గుర్తిస్తున్నాయి. గత ఏడు దశాబ్ధాల కాలం లో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు దేశాన్ని అప్పులు చేసి మరీ ఋణభార ఊబి లోకి నేట్టేశారు. నరెంద్ర మోది తన బాజపా వారిపై అవినీతిని వదిలేసిన దాదాపు ఇతర పార్టీలలోని అవొఇనీతి అక్రమసంపాదనా పరులపై కొరడా ఝుళిపిస్తూనే ఉన్నారు.

popularity graph of narendra modi in india కోసం చిత్ర ఫలితం


ప్రజలకు దోపిడి దొంగల స్వైర విహారం నిరోధినచటం నివారించటం కావాలి. వీళ్ళు ఏపార్టీ వారని కాదు వాళ్ళకు గుండెల్లో దడ పుట్తించటం మొదలవ్వాలి. అదే నరెంద్ర మోదీ చేస్తున్నారు. తమిళనాడులో శశికళ అక్రమ ఆస్తులు చూస్తుంటే ఆర్ధికవేత్తలకే తలతిరిగి పోతుంది. భారత్ కు సరైన నాయకత్వం ఇవ్వగల  నాయకుడు జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా సమర్ధవంత మైన నాయకత్వం దొరికిందనే భావిస్తున్నారు. ఇక బినామీలపై చర్యలు మొదలెడితే నల్లధనం కొంతైనా బయట పడవచ్చు.   


నోట్ల రద్దుపై దుమారం రేగినా
జీఎస్టీపై విమర్శలు వెల్లువెత్తినా


ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా ఏ మాత్రం తగ్గలేదు. అమెరికాకు చెందిన "ప్యూ రీసెర్చ్‌" సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విష యం వెల్లడయింది. సర్వేలో 88 శాతం ఓట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో రాహుల్‌ గాంధీ (58 శాతం) సోనియా గాంధీ (57శాతం), అరవింద్‌ కేజ్రీవాల్‌ (39శాతం) ఉన్నారు. తెలుగు రాష్ట్రాలోన్లూ మోదీకి ఆదరణ పెరుగు తోంది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 మధ్య దేశవ్యాప్తంగా 2464 మందిపై ఈ సర్వే నిర్వహించారు.
 
popularity graph of narendra modi in india కోసం చిత్ర ఫలితం

           

 ‘ప్యూ’ సర్వే వివరాలు


*ఉత్తర భారతాన మోదీ పాపులారిటీలో మార్పులేదు.
*దక్షిణ, పశ్చిమ భారతం లో ఆదరణ పెరుగుతోంది. తూర్పున కాస్త తగ్గింది.
*తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ ప్రతి 10 మందిలో 9 మంది మోదీ పట్ల సానుకూలత చూపిస్తున్నారు.
*ఢిల్లీ, పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రతి 10 మందిలో 8 మంది మోదీ పట్ల సానుకూలతతో ఉన్నారు.
*సర్వేలో పాల్గొన్న ప్రతి 10 మందిలో 8 మంది భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని అంగీకరించారు.
*దేశంలో పాలన సవ్యంగా సాగుతోందని, ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రతి మందిలో ఏడుగురు అభిప్రాయపడ్డారు.
*ఆర్ధిక వ్యవస్థ బాగుందని చెప్పిన వారి సంఖ్య, 2014తో పోలిస్తే 19 శాతం అధికం.


popularity graph of narendra modi in india కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: